స్టార్ హీరోయిన్ కావాల్సింది.. ఒక్క యాక్సిడెంట్‌తో ఇప్పుడు ఇలా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

07 February 2026

కెరీర్ ప్రారంభంలో కథానాయికగా నటించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. కానీ ఒక్క సినిమాతోనే  ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. 

కానీ కెరీర్ పీక్ లో ఉండగానే యాక్సిడెంట్ కావడంతో అంతా రివర్స్ అయ్యింది. ఆ ప్రమాదంలో దాదాపు రెండేళ్లు బెడ్ కే పరిమితమయ్యింది  ఈ అమ్మడు.

ఇప్పుడు కెరీర్ తిరిగి ప్రారంభించింది. ఆమె మరెవరో కాదు నభా నటేశ్. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉంటుంది. 

తొలి నాళ్లల్లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన పలు చిత్రాలు ప్లాప్స్ అయ్యాయి. అదే సమయంలో యాక్సిడెంట్ కు గురైంది ఈ బ్యూటీ.

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ హిట్టు మాత్రం అందుకోలేకపోయింది. కానీ రామ్ పోతినేని సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్టైంది.

ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఆమె ఊహించని విధంగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడింది.

దాదాపు రెండేళ్లు బెడ్ కె పరిమితమైన ఆమె ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో తెలుగులో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.