AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో పీఎం మోడీ వీడియో కాన్ఫరెన్స్

COVID Review Meeting: దేశంలో ఇటీవలి కాలంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నెల 27, బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.

PM Modi: దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో పీఎం మోడీ  వీడియో కాన్ఫరెన్స్
Pm Modi
Sanjay Kasula
|

Updated on: Apr 24, 2022 | 10:02 PM

Share

దేశంలో ఇటీవలి కాలంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నెల 27, బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవుతారని కేంద్రం వెల్లడించింది. కరోనా కేసుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ ఈ అంశంపై ప్రజంటేషన్ ఇవ్వబోతున్నారు. దేశంలో తాజాగా 15 వేలకుపైగా కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 4,30,54,952 కరోనా కేసులు నమోదయ్యాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ..

విడుదల చేసిన గణాంకాల ప్రకారం , గత 24 గంటల్లో 2,593 కొత్త కరోనావైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత దేశంలో మొత్తం కరోనా ఇన్ఫెక్షన్ రోగుల సంఖ్య 4,25,19,479కి పెరిగింది. అదే సమయంలో, యాక్టివ్ కేసుల సంఖ్య 15,873కి పెరిగింది. డేటా ప్రకారం, ఇప్పుడు మన దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,22,193 కు పెరిగింది.

రాజధాని ఢిల్లీలో 1094 కొత్త కేసులు.. దేశ రాజధానిలో గత 24 గంటల్లో, ఢిల్లీలో 1094 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 2 రోగులు కూడా మరణించారు. దీంతో ఇప్పుడు ఢిల్లీలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3705కి చేరింది. కాగా, గత 24 గంటల్లో రాజధాని ఢిల్లీలో కరోనా ఇన్‌ఫెక్షన్ రేటు 4.82 శాతంగా నమోదైంది. భయాందోళనలకు గురికావద్దని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో ప్రభుత్వం మళ్లీ మాస్క్‌లను తప్పనిసరి చేసింది.

ఇవి కూడా చదవండి: Lata Mangeshkar Award: దేశప్రజలకు లతామంగేష్కర్​అవార్డ్ అంకితం.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..

Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!