PM Narendra Modi: కరోనా ఫోర్త్ వేవ్ అలర్ట్.. ఎల్లుండి సీఎంలతో భేటీ కానున్న ప్రధాని మోడీ..
PM Modi To Chair Covid-19 Review: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ
PM Modi To Chair Covid-19 Review: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలను సూచించింది. కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. అయితే.. గత రెండు వారాల నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (ఏప్రిల్ 27) దేశంలోని కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, వారి సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది.
“దేశంలో కోవిడ్ పరిస్థితిని చర్చించడానికి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఏప్రిల్ 27 బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం జరగనుందని.. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రస్తుత కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ డ్రైవ్, కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల గురించి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాగా.. అంతకు ముందుకు క్షేత్రస్థాయిలో కోవిడ్ పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రధాని మోదీ సీఎంలతో పాటు జిల్లా మేజిస్ట్రేట్‌లతో పలు సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆదివారం వరకు దేశంలో 187.67 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. 12-14 సంవత్సరాల వయస్సు గల వారికి 2.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌ల మొదటి డోస్‌లు అందించినట్లు కేంద్రం వెల్లడించింది. శనివారం 2,593 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య15,873 కి పెరిగింది. కోవిడ్ రికవరీ రేటు ప్రస్తుతం 98.75 శాతంగా ఉంది.
Also Read: