India Covid-19: కరోనా ఫోర్త్ వేవ్ అలర్ట్.. మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు..
India Covid-19 Updates: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు అందరిని భయాందోనకు గురిచేస్తున్నాయి. కోవిడ్ థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటంతో..
India Covid-19 Updates: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు అందరిని భయాందోనకు గురిచేస్తున్నాయి. కోవిడ్ థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటంతో ఇటు కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు సూచనలు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ సహా ముంబై తదితర ప్రాంతాల్లో కరోనా (Coronavirus) కేసులు.. పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న ఆంక్షలు విధించి అమలు చేస్తున్నారు. కాగా.. శనివారం కూడా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. దేశంలో గత 24 గంటల్లో 2,593 కేసులు నమోదు కాగా.. 44 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే.. 66 కేసులు, 11 మరణాలు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 15,873 (0.04 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
- తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మొత్తం కేసుల సంఖ్య 4,30,57,545 కి చేరింది.
- కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,22,193 కి పెరిగింది.
- నిన్న కరోనా నుంచి 1,755 మంది కోలుకున్నారు.
- వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,19,479 కి చేరింది.
- దేశంలో రికవరీ రేటు 98.75 శాతం ఉంది.
- ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 187,67,20,318 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
- నిన్న 19,05,374 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
Also Read: