AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC For Rent: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా.. కేవలం రూ. 915 చెల్లిస్తే అద్దెకు ఏసీ..

AC For Rent: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఉష్ట్రోగ్రతలతో ఇళ్లలోని పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉండలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏసీలు అందరూ కొనలేరు. అలాంటి వారికి గుడ్ న్యూస్..

AC For Rent: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా.. కేవలం రూ. 915 చెల్లిస్తే అద్దెకు ఏసీ..
Air Conditioner
Ayyappa Mamidi
|

Updated on: Apr 24, 2022 | 8:14 AM

Share

AC For Rent: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఉష్ట్రోగ్రతలతో ఇళ్లలోని పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉండలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏసీలు అందరూ కొనలేరు. ఇలాంటి వారి కోసం ఏసీ, కూలర్లు అద్దెకు తీసుకునేందుకు కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఏసీ ఇన్‌స్టాలేషన్, రీలొకేషన్, మెయింటెనెన్స్ వంటివి అన్నీ కస్టమర్ నుంచి వసూలు చేసే అద్దె మొత్తంలోనే కలిసి ఉంటాయి. కేవలం ఏసీ, కూలర్ మాత్రమే కాకుండా ఇతర హోమ్ అప్లయెన్సెస్ కూడా అద్దెకు తీసుకునే వెసులుబాటు ఇందులో ఉంది. ఇలా చేయటం వల్ల స్వాంతన పొందటంతో పాటు, చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు. వీటిని ఎలా అద్దెకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తవానికి ఏసీలు అద్దెకిస్తారని చాలా మందికి తెలియదు. కానీ మీరు అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా AC అద్దెకు తీసుకోవచ్చు. ఏదైనా ఆన్‌లైన్ రెంటల్ సైట్ నుంచి AC తీసుకునే ముందు మీరు దానిలోని అన్ని నిబంధనలు, షరతులను తప్పక చదవాలి. ఇది కాకుండా డబ్బు చెల్లించే ముందు కస్టమర్ సపోర్ట్ టీమ్‌కు కాల్ చేసి ఏవైనా అనుమానాలు ఉంటే వివరాలు అడిగి తెసుకోవాలి. ఈ సౌకర్యం దిల్లీ, ముంబయి, నోయిడా, గురుగ్రామ్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.

Rent mojo అనే ప్లాట్‌ఫామ్ ఫర్నిచర్ నుంచి హోమ్ అప్లయన్సెస్ వరకు చాలా వాటిని అద్దెకు ఇస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ పలు ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తోంది. మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దీని సేవలను వాడుకోవచ్చు. రెంట్ మోజోలో ఏసీ రెంట్ నెలకు రూ.1219 నుంచి ప్రారంభం అవుతోంది. 1 టన్ను ఏసీకి ఇది వర్తిస్తుంది. 1.5 టన్ను ఏసీకి నెలకు రూ.2469 చెల్లించాల్సి ఉంటుంది. అన్ని చార్జీలు ఇందులోనే కలిపి ఉంటాయి. అయితే మీరు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. రెంట్ గడువు తీరిన తర్వాత ఈ డబ్బులు మీకు వెనక్కి చెల్లిస్తారు.

City Furnish ద్వారా కూడా రెంటల్ సర్వీసులు పొందొచ్చు. ఫర్నీచర్, ఇతర అప్లయెన్సెస్ అద్దె చెల్లించి తీసుకోవచ్చు. ఈ సంస్థ కూడా పలు పట్టణాల్లో సేవలు అందిస్తోంది. అయితే ఈ ప్లాట్‌ఫామ్‌లో కేవలం ఒకే ఒక విండో ఏసీ మోడల్ మాత్రమే లిస్ట్ అయ్యి ఉంది. ఇది 1.5 టన్ను కెపాసిటీ ఏసీ. దీనికి నెలకు రూ.1569 అద్దె చెల్లించాలి. ఇక్కడ కూడా మీరు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.

Fair Rent అనే ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా అద్దెకు పొందొచ్చు. విండో ఏసీలు, స్ల్పిట్ ఏసీలు వంటివి లభిస్తున్నాయి. ఇక్కడ అద్దె నెలకు రూ.915 నుంచి ప్రారంభం అవుతోంది. 0.75 టన్ను విండో ఏసీకి ఇది వర్తిస్తుంది. అదే టన్ను స్ల్పిట్ ఏసీ అయితే రూ.1375 చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ఇన్‌స్టాలేషన్ ఫెసిలిటీ ఉంది. అలాగే స్టెబిలైజర్ కూడా ఇస్తున్నారు. అందువల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇకపోతే ఏసీలకు ఫుల్ డిమాండ్ ఉంది. అందువల్ల ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోవచ్చు. అందువల్ల రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

RBI Fines Bank: కస్టమర్‌కు సకాలంలో డబ్బు చెల్లించని బ్యాంక్.. భారీ జరిమానా విధించిన RBI..

Edible Oil Price: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న వంట నూనె ధరలు.. కారణం ఇదే