RBI Fines Bank: కస్టమర్‌కు సకాలంలో డబ్బు చెల్లించని బ్యాంక్.. భారీ జరిమానా విధించిన RBI..
RBI Fines Bank: ఈ మధ్య కాలంలో రిజర్వు బ్యాంక్ బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు తెస్తోంది. వినియోగదారులకు ప్రాధాన్యం ఇస్తూ అనేక నిబంధనలను కూడా తీసుకొస్తోంది. తాజాగా రూల్స్ అతిక్రమించినందుకు మరో బ్యాంక్ పై భారీగా జరిమానా విధించింది.
RBI Fines Bank: ఈ మధ్య కాలంలో రిజర్వు బ్యాంక్ బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు తెస్తోంది. వినియోగదారులకు ప్రాధాన్యం ఇస్తూ అనేక నిబంధనలను కూడా తీసుకొస్తోంది. ఇదే సమయంలో తాజాగా.. RBI ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు(Central Bank of India) షాక్ ఇచ్చింది. సదరు బ్యాంకుపై భారీ జరిమానాను విధించింది. కస్టమర్ ప్రొటెక్షన్ లిమిటింగ్ లయబిలిటీ ఆఫ్ కస్టమర్స్ ఇన్ అన్అథరైజ్డ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన సదరు బ్యాంక్ ఉల్లంఘించడం దీనికి ప్రధాన కారణం. నిబంధనల అతిక్రమించినందుకు గాను రూ. 36 లక్షల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్- 1949 కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
బ్యాంక్‌కు సంబంధించిన సూపర్‌వైజరీ ఎవల్యూషన్ కోసం ఆర్‌బీఐ తనిఖీ నిర్వహించింది. 2020 మార్చి 31 నాటి బ్యాంక్ ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుంది. రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్, తనిఖీ నివేదిక వంటి వాటిని పరిశీలించింది. ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని నిశితంగా తనిఖీలు చేసింది. వీటిల్లో బ్యాంక్ ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. అన్ఆథరైజ్డ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి బ్యాంక్ కస్టమర్‌కు ఆ డబ్బులను నిర్ణీత గడువులోగా బ్యాంకు రిటర్న్ చేయలేదని ఆర్బీఐ ఆడిట్ లో తేలింది. కస్టమర్లు ఆ విషయాన్ని బ్యాంక్‌కు తెలియజేశాడు. అయితే బ్యాంక్ 10 రోజుల్లోగా ఆ మెుత్తాన్ని కస్టమర్ కు తిరిగి చెల్లించలేదు. ఈ కారణంగా బ్యాంక్ రూల్స్ అతిక్రమించినట్లు అయింది. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై జరిమానా వేసింది.
జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని సదరు బ్యాంక్‌కు RBI షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బ్యాంక్ నుంచి సమాధానం వచ్చిన తర్వాత దీనిపై తుది నిర్ణయం ఉంటుంది. బ్యాంక్ వివరణ ఆధారంగా జరిమానా విధింపు ఉంటుందా? ఉండదా? అనే అంశం ఫైనల్ అవుతుంది. కాగా ఈ పెనాల్టీ నేపథ్యంలో బీఎస్ఈలో శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ఇండియా షేరు ధర 1.3 శాతం మేర క్షీణించి.. రూ.19.6 వద్ద ముగిశాయి. ఆర్‌బీఐ ఇటీవల ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మణప్పురం ఫైనాన్స్‌కు కూడా రూ.17 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Nigeria explosion: ఘోర ప్రమాదం.. ఫ్యాక్టరీలో పేలుడు.. 100 మందికి పైగా సజీవ దహనం!