Reliance Future Deal: ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు డీల్ లో వెనక్కు తగ్గిన రిలయన్స్.. ఎందుకంటే..
Reliance Future Deal: కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్‌తో(Future Group) కుదిరిన విలీన ఒప్పందాన్ని రద్దు రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసుకుంది. రూ.24,713 కోట్లు విలువైన ఈ ఒప్పందం రద్దుకు కారణం ఏమిటంటే..
Reliance Future Deal: కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్‌తో(Future Group) కుదిరిన విలీన ఒప్పందాన్ని రద్దు రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసుకుంది. ఫ్యూచర్ గ్రూప్‌తో రూ.24,713 కోట్లు విలువైన ఒప్పందాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) రద్దు చేసుకుంది. ఫ్యూచర్‌గ్రూప్ రుణదాతలు వ్యతిరేకించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రిలయన్స్ సంస్థ వెల్లడించింది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ 2020 ఆగస్టులో ఒప్పందం చేసుకుంది. డీల్ విలువ రూ.24,713 కోట్లుగా ఉంది. ఫ్యూచర్ రిటైల్‌తో పాటు ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన పలు లిస్టెడ్ కంపెనీలు, తమ వాటాదార్లు, రుణదాతల సమావేశాలను ఇటీవలే పూర్తి చేశాయని రిలయన్స్ తాజా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కు తమ ఆస్తులను రూ.24,713 కోట్లకు విక్రయించేందుకు రుణదాతలు అనుమతించ లేదని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ తమకు తెలియజేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. వారంతా ఓటింగ్ రూపంలో తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. ఈ ఒప్పందంపై ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వచ్చింది. తమ కంపెనీతో గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఫ్యూచర్ గ్రూప్ ఉల్లంఘించిందని అమెజాన్ ఆరోపిస్తూ ఆర్బిట్రేటన్ కు, కోర్టులకు కూడా వెళ్లింది. ఈ ఒప్పందం చెల్లుబాటు కాదంటూ సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది.
ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్, రవాణా(లాజిస్టిక్స్), గిడ్డంగుల నిర్వహణ వ్యాపారాలను రిల్ అనుబంధ విభాగాలైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్ కు విక్రయించేందుకు ఆగస్టు 2020లో ఒప్పందం కుదిరింది. రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగాలకు చెందిన మొత్తం 19 ఫ్యూచర్ గ్రూపు కంపెనీలను కొనేందుకు రిలయన్స్ ఒప్పందం కుదర్చుకుంది. ఓ దశలో అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య కుదిరిన డీల్‌ను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఇలా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదం ఎక్కడా పరిష్కారం కాకపోవడం వల్ల సుప్రీంకోర్టు సూచన మేరకు తిరిగి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లోనే తేల్చుకునేందుకు ఇటీవలే ఇరు వర్గాలు అంగీకరించాయి. ఇంతలోనే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రిలయన్స్ ప్రకటించడం గమనార్హం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
AC For Rent: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా.. కేవలం రూ. 915 చెల్లిస్తే అద్దెకు ఏసీ..
RBI Fines Bank: కస్టమర్‌కు సకాలంలో డబ్బు చెల్లించని బ్యాంక్.. భారీ జరిమానా విధించిన RBI..