AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ మీరేం మనుషులురా..! అన్నదాత కష్టార్జితాన్ని కూడా వదిలి పెట్టరా..!

ఏ ధరలు ఎక్కువుగా ఉంటే వాటిపై దొంగలు దృష్టి పెడుతున్నారు. బంగారం ధరలు పెరిగిపోవడంతో చెయిన్ స్నాచింగ్స్ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దొంగలు గుంటూరు మిర్చిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఉన్నారు. గత కొంతకాలంగా మిర్చి ధరలు పెరుగుతూ ఉన్నాయి. క్వింటా మిర్చి ఇరవై ఐదు వేల రూపాయల ధర పలుకుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

బాబోయ్ మీరేం మనుషులురా..! అన్నదాత కష్టార్జితాన్ని కూడా వదిలి పెట్టరా..!
Thieves Stolen Chilies
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 8:39 PM

Share

ఏ ధరలు ఎక్కువుగా ఉంటే వాటిపై దొంగలు దృష్టి పెడుతున్నారు. బంగారం ధరలు పెరిగిపోవడంతో చెయిన్ స్నాచింగ్స్ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దొంగలు గుంటూరు మిర్చిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఉన్నారు. గత కొంతకాలంగా మిర్చి ధరలు పెరుగుతూ ఉన్నాయి. క్వింటా మిర్చి ఇరవై ఐదు వేల రూపాయల ధర పలుకుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులు తగ్గినా మంచి ధర వస్తుండటంపై రైతులు సంతోష పడుతున్నారు. అయితే ఇది ఇలా ఉంటే దొంగలు మిర్చిపై దృష్టి పట్టారన్న వార్తలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

రెండు రోజులు క్రితం గుంటూరు, పల్నాడు ప్రాంతంలో అకాల వర్షాలు పడ్డాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామంలో గుంటనాల సుధాకర్ ఏడు ఎకరాలను కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశారు. మిర్చిని కోసి కల్లాల్లో ఎండబెట్టారు. వర్షం పడటంతో కుప్పగా పోసి పట్టాలు కప్పారు. రాత్రి వర్షం పడటంతో కాపలాకు వెళ్లలేదు. దీంతో కుప్ప పోసిన ఇరవై ఐదు క్వింటాళ్ల మిర్చి తెల్లవారి వెళ్లి చూసేసరికి కనిపించలేదు. దీంతో రైతు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మొత్తం మిర్చి కనిపించకపోవడంతో దొంగలే ఎత్తుకెళ్లినట్లు భావించాడు. అదే గ్రామానికి చెందిన వెంకటరావు కూడా మిర్చి సాగు చేశాడు. చేలో పండిన పది క్వింటాళ్ల మిర్చిని ఆరబోశాడు. వర్షం పడటంతోనే కాపలాకు వెళ్లలేదు. తెల్లవారి వెళ్లే సరికి తన పది క్వింటాళ్ల మిర్చి కూడా కనిపించలేదు. దీంతో దొంగలు ముందస్తుగా ప్లాన్ చేసి ముప్పై ఐదు క్వింటాళ్ల మిర్చిని ఎత్తుకెళ్లినట్లు రైతులు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు వాహనం తీసుకొచ్చి మొత్తం మిర్చిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. దొంగలను గుర్తించి పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. అయితే రెండేళ్ల క్రితం కూడా ఇదే విధంగా దొంగలు కల్లాల్లో ఉన్న మిర్చిని ఎత్తుకెళ్లారు. దీంతో అప్పుడు పొల్లాల్లోనే రైతులు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. తిరిగి రెండేళ్ల తర్వాత మరోసారి దొంగలు మిర్చిపై దృష్టి పెట్టడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. లక్షల ఎకరాల్లో సాగు చేసే రైతులు వాటిని దొంగల బారిన పడకుండా కాపాడుకోవడం సవాల్ గా మారింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దొంగలను పట్టుకుంటేనే రానున్న రోజుల్లో చోరిలు ఆగుతాయని రైతులు అంటున్నారు. లేదంటే ఆరుగాలం కష్టించి పండించిన పంటను కాపాడుకోవడం కష్టమేనంటున్నారు… మరి పోలీసులు ఏంచేస్తారో వేచి చూడాలి..!

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us