AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే సినిమాలు చేయలేదట.. పటాస్‌లో కళ్యాణ్ రామ్ చెల్లి గుర్తుందా.? ఇప్పుడు ఏం చేస్తుందంటే

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటాస్ మూవీతో ఈ అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె మూగ, చెవిటి అమ్మాయి కావ్య పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీలో ఆమె పాత్ర నిడివి ఉండేది కాసేపే అయినప్పటికీ.. తన నటనతో అదరగొట్టింది.

అందుకే సినిమాలు చేయలేదట.. పటాస్‌లో కళ్యాణ్ రామ్ చెల్లి గుర్తుందా.? ఇప్పుడు ఏం చేస్తుందంటే
Patas Movie
Rajeev Rayala
|

Updated on: Mar 20, 2026 | 7:09 PM

Share

ప్రాచీ థాకర్.. ఈ పేరు చెప్తే పెద్దగా ఎవ్వరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమా చూస్తే ఈ అమ్మడిని గుర్తిపట్టేస్తారు. పటాస్ సినిమాలో కళ్యాణ్ రామ్ చెల్లిగా కనిపించింది ప్రాచీ. ఆ సినిమాలో మాటలు రాని అమ్మాయిగా కనిపించింది. అయితే ప్రచీ ఠాకూర్ ఆ సినిమా తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. సినిమాలు కూడా పెద్దగా చేయలేదు. దాంతో ఈ అమ్మడు ఏమైపోయిందా అని చాలా మంది గూగుల్ ను గాలించారు కూడా.. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో ప్రాచీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో ఆమె సినిమాలు చేయడాపోవడానికి కారణాలు కూడా పంచుకుంది. ఇంతకూ ఆమె ఏం చెప్పిందంటే..

ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు అవమానించారు.. షూటింగ్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్లా..

ప్రాచీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో టెక్స్‌టైల్ డిజైనింగ్ చదువుతున్న సమయంలో మోడలింగ్‌పై ఆసక్తి పెరిగింది. ఒకసారి స్నేహితుల ద్వారా ఆడిషన్ గురించి తెలుసుకుని, ప్రశాంత్ దర్శకత్వంలో సైలెంట్ మెలోడీ అనే ప్రాజెక్ట్‌లో అవకాశం అనుకున్నా అని తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో ఆమె మాటల లేని పాత్రలో నటించింది. ఈ సైలెంట్ మెలోడీలో ఆమె నటన చూసిన అనిల్ రావిపూడి, తన పటాస్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకు ప్రచీని ఎంపిక చేశారట. పటాస్ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఒక పెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమాలోప్రాచీ పాత్రకు ప్రశంసలు లభించాయి. అయితే, ఈ విజయాన్ని తాను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయానని ప్రచీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

ఆ సమయంలో ఆమె కాలేజీ మూడవ సంవత్సరంలో ఉండటం, పరిశ్రమలో మార్గనిర్దేశం చేసేవారు ఎవరూ లేకపోవడం దీనికి ప్రధాన కారణం అని తెలిపింది. తన తల్లిదండ్రులు నిఫ్ట్ కోసం భారీ ఫీజులు కట్టారు, కాలేజీని బంక్ చేసి షూటింగ్‌లకు వెళ్లడానికి ఆలోచించా అని ఆమె తెలిపారు. ఆ సమయంలో తనకు సీరియల్, సినిమా ఆఫర్లు వచ్చినా, వాటిని స్వీకరించడానికి సరైన మార్గదర్శకత్వం లేదని చెప్పుకొచ్చింది. భాషా కూడా కూడా ఆమెకు ఒక సవాలుగా నిలిచింది. సైలెంట్ మెలోడీ, పటాస్ చిత్రాలలో ఆమె మాటలు లేని పాత్రలు చేశా.. ఈ కారణంగా, కొంతమంది ప్రేక్షకులు ఆమెను నిజంగానే చెవిటి, మూగ (డెఫ్ అండ్ మ్యూట్) అని భావించారని, ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు కూడా వచ్చాయని ప్రచీ గుర్తుచేసుకుంది. ఇదే తరహా పాత్రలలో టైప్‌కాస్ట్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో, పటాస్ తమిళ రీమేక్‌లో అదే పాత్రను పోషించమని ఆఫర్ వచ్చినా ఆమె నో చెప్పిందట. కాలేజీ గ్రాడ్యుయేషన్ తర్వాత, ప్రచీ ఠాకూర్ కొంతకాలం పరిశ్రమకు దూరమయ్యింది. 2019లో బ్యాడ్ ట్రిప్ సినిమా కోసం హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి వచ్చినా, లవ్ యూ టూ వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా అని తెలిపింది ఈ అందాల తార.. అలాగే సవాలుతో కూడిన పాత్రలను పోషించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది నటి ప్రాచీ. ప్రస్తుతం హిందీలో సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. మొన్నామధ్య బకాసుర రెస్టారెంట్ అనే సినిమాలో కనిపించింది.

Actress : రెండు పెళ్లిళ్లు.. మరో ఇద్దరితో ప్రేమాయణం..!! కట్ చేస్తే తనకన్నా 13 ఏళ్లుపెద్ద వాడితో….

OTT Movie : ముగ్గురు భామలు, వణికించే సీన్స్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర