Andhra Pradesh: ఉగాది పండక్కి ఆ ఊరి వెంకటేశ్వర ఆలయంలో ముస్లీంల పూజలు..! విశిష్టత ఏమంటే..
కడప నగరంలోని తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా ఉగాదికి ముస్లింలు ఆయనను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామికి శారె సమర్పిస్తారు. ముస్లింల ఆడపడుచు అయిన బీబీ నాంచారమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి..

కడప, మార్చి 20: హిందూ దేవాలయంలో ముస్లింలు పూజలు చేయడం అనేది ఎక్కడా చూసి ఉండరు.. కానీ దేవుని కడప దేవాలయంలో ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామిని ముస్లింలు దర్శించుకుని ఆయనకు శారె సమర్పిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీరు చదవాల్సిందే.
కడప నగరంలోని తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా ఉగాదికి ముస్లింలు ఆయనను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామికి శారె సమర్పిస్తారు. ముస్లింల ఆడపడుచు అయిన బీబీ నాంచారమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి ఆయనలో లీనమైపోయిందని నమ్మకం. అందువలన ఆమె ఆయనకు అర్ధాంగిగా ముస్లింలు భావిస్తారు. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని వారి బావగారిగా ముస్లింలు భావించి ఆడపడుచుకు శారె ఇచ్చిన మాదిరిగా.. శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా ప్రతిఏటా బెల్లం పప్పులు, బట్టలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బీబీ నాంచారమ్మకు సంబంధించిన విగ్రహం కూడా ఉంటుంది ఆమెకు కూడా అక్కడ ముస్లింలు ప్రత్యేక పూజలు చేస్తారు ఇది కొన్ని దశాబ్దాల కాలంగా ప్రతి ఏటా ఉగాది రోజు జరుగుతున్న ఆనవాయితీగా ముస్లింలు చెప్తారు .. అంతేకాకుండా మతసామరస్యాలకు ప్రతీకకు కూడా ఈ దేవాలయం నిలుస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




