చాణక్య నీతి : ఎప్పటికీ ధనవంతులు కాలేని వ్యక్తులు వీరే

Samatha

27 July 2026

చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.

అదే విధంగా చాణక్యుడు ఎప్పటికీ గొప్పవారు కాలేని వారి గురించి కూడా తెలియజేశాడు.  కాగా, ఇప్పుడు మనం ఏ లక్షణాలు ఉంటే గొప్పవారు కాదో తెలుసుకుందాం.

ఏ వ్యక్తి అయితే పదే పదే ఇతరులపై ఆధారపడి జీవిస్తాడో, అలాంటి వ్యక్తి జీవితంలో ఏం సాధించలేడని చాణక్యుడు చెబుతున్నాడు.

అంతే కాకుండా ఏ పని చేయడానికి కూడా ఆసక్తి చూపని వ్యక్తి కూడా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లలేడు, ధనవంతుడు కాలేడంట.

ఇతరులతో కఠినంగా మాట్లాడే వ్యక్తి కూడా ఎప్పుడూ జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోలేడు అని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.

సోమరితనం ఉన్న వ్యక్తులు కూడా ఎప్పటికీ ధనవంతులు కాలేరు, వారు ఎప్పుడూ పనులు వాయిదా వేస్తారని చెబుతున్నాడు చాణక్యుడు.

ఎందుకంటే? సోమరితనం వలన పురోగతి సాధించలేరు. అవకాశాలు కూడా చేజారిపోతాయి. దీంతో వారు ధనవంతులు కాలేరంట.

అలాగే ఇతరులను చూసి అసూయపడేవారు, నిరంతరం అబద్ధాలు చెప్పేవారు కూడా ఎప్పటికీ ధనవంతులు కాలేరంట.