AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiac Signs: చంద్రుడి ఉచ్ఛ స్థితి.. ఇక ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!

Moon Exalted in Taurus: ఈ నెల(మార్చి) 23, 24, 25 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛపట్టడం జరుగుతోంది. మనసుకు, తల్లికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి కారకుడైన చంద్రుడు ఉచ్ఛపట్టడం కొన్ని రాశులకు బాగా లాభకరంగా ఉంటుంది. ఈ మూడు రోజుల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు సమీప భవిష్యత్తులో విజయవంతం అవడానికి బాగా అవకాశం ఉంది. చంద్రుడి ఉచ్ఛ స్థితి వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారి దశ, దిశ తిరిగే అవకాశం ఉంది. వీరు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 5:45 PM

Share
మేషం: ఈ రాశికి చతుర్థాధిపతి అయిన చంద్రుడు ధన స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరిగే అవకాశం ఉంటుంది. ఆస్తి, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరగడం, ఆదాయ మార్గాలు విస్తరించడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, కళాకారులు బాగా రాణిస్తారు. రావలసిన డబ్బు వసూలై ముఖ్య మైన అవసరాలు తీరిపోతాయి. గృహ, వాహన సౌకర్యాల ప్రయత్నాలు సాగించడం మంచిది.

1 / 6
వృషభం: ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. తల్లి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

2 / 6
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.

3 / 6

కన్యా రాశి వారికి అంతా మంచే జరుగనుంది. అరుదైన గ్రహాలైన బృహస్పతి , శుక్రుడు, బుధుడు కలవడం వలన వీరి మీద డబ్బు వర్షం కురవనుంది. అంతే కాదు, అనుకున్న పనులన్ని జరుగుతాయి. మీ పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు సప్తమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి కుదరడం గానీ జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు, ఒకటి రెండు ధన యోగాలకు కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు బాగా లాభిస్తాయి.

5 / 6
అరుదైన గ్రహాలు కలవడం వలన మకర రాశి వారికీ కలిసి రానుంది. ఇప్పటి వరకు ఉన్నబాధలు మొత్తం పోనున్నాయి. కొత్తగా వ్యాపారాలు మొదలు పెడతారు. అలాగే, వీరి జీవితంలో కొత్త మార్పులు రానున్నాయి. ఆర్ధిక సమస్యలు నుంచి బయట పడతారు.

6 / 6
Follow Us