LIC IPO News: ఎల్ఐసీ ఐపీవో విక్రయించే వాటా తగ్గిందా.. అసలు మార్కెట్లోకి ఎప్పుడు రానుందంటే..

LIC IPO News: ఐపీవో ద్వారా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లో ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మే నెల మెుదటి వారంలో జరగవచ్చని మార్కెట్లో చర్చ జరుగుతోంది.

LIC IPO News: ఎల్ఐసీ ఐపీవో విక్రయించే వాటా తగ్గిందా.. అసలు మార్కెట్లోకి ఎప్పుడు రానుందంటే..
Lic Ipo
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 24, 2022 | 9:53 AM

LIC IPO News: ఐపీవో ద్వారా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లో ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మే నెల మెుదటి వారంలో జరగవచ్చని మార్కెట్లో చర్చ జరుగుతోంది. పబ్లిక్ ఇష్యూ పరిమాణాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పబ్లిక్ ఇష్యూపై ఫండ్ మేనేజర్లు ఆసక్తి తగ్గిపోయినందున ఎల్‌ఐసీ ఐపీఓను వాయిదా వేశారు. అయితే ఈ పబ్లిక్ ఆఫరింగ్ కోసం ప్రభుత్వానికి మే 12 వరకు గడువు ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. గత ఫిబ్రవరిలో సెబీకి ఎల్‌ఐసీ దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌లో 5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనున్నట్లు తెలిపింది. తాజాగా దానిని 3.5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనకు శనివారం ఎల్‌ఐసీ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే.. ఇన్వెస్టర్ల స్పందనకు అనుగుణంగా సంస్థ విలువను రూ. 6 లక్షల కోట్లుగా ఖరారు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒడిదుడుకులు తలెత్తడంతో ఎల్‌ఐసీ ఆఫర్‌ పరిమాణాన్ని, విలువను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రీమియంలో కొంత పెరుగుదల కారణంగా ఎల్‌ఐసీ లాభం అనేక రెట్లు పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో ఎల్‌ఐసీ లాభం రూ. 234.9 కోట్లుగా ఉంది. పాలసీల అమ్మకంలోనూ కంపెనీ దూసుకుపోతోంది. పర్సనల్ ఇన్సూరెన్స్ కేటగిరీలో కంపెనీకి 74.6 శాతం మార్కెట్ వాటా ఉంది. దేశంలో అమ్ముడవుతున్న ప్రతి పది కొత్త ఇన్సూరెన్స్ పాలసీల్లో ఏడు LICకి చెందినవేనని నివేదికలు చెబుతున్నాయి. ఐదు శాతం వాటాలను విక్రయించడం ద్వా రా రూ.65,000 కోట్లు సమీకరించాలని ముందుగా కేంద్రం అనుకున్నప్పటికీ.. దానిని రూ.21,000 కోట్లకే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మీడియా వార్తలు చెబుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Reliance Future Deal: ఫ్యూచర్‌ గ్రూప్‌ కొనుగోలు డీల్ లో వెనక్కు తగ్గిన రిలయన్స్.. ఎందుకంటే..

AC For Rent: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా.. కేవలం రూ. 915 చెల్లిస్తే అద్దెకు ఏసీ..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.