Anirudh XV Tour: హైదరాబాద్‌లో అనిరుధ్ మ్యూజికల్ కన్సర్ట్.. వెళ్లాలనుకుంటే ఇలా చేయండి
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ తన సంగీత ప్రయాణంలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్ నగరం వేదికగా ఓ భారీ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు. శనివారం (మార్చి 21) జరిగే ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలిరావొచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్వాహకులు కొన్ని కీలకమైన సూచనలు జారీ చేశారు.

రాక్‌స్టార్ అనిరుధ్ XV – 15 ఇయర్స్ విత్ యూ సంగీత కచేరీకి హైదరాబాద్ నగరం సిద్ధమైంది. గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియంలో శనివారం (మార్చి 21) నాడు జరగబోయే ఈ మ్యూజికల్ ఈవెంట్ కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. . ఈ ఈవెంట్‌ను Brand Avatar నిర్వహిస్తుండగా, TribeVibe Entertainment (BookMyShow సంస్థ) సహకారంతో, Ocean Vibes ప్రెజెంట్ చేస్తోంది. ఈ కాన్సర్ట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తూ, నిర్వాహకులు ప్రత్యేక పార్కింగ్, షటిల్ సదుపాయాలను ఏర్పాటు చేశారు.
ఎంట్రీ వివరాలు
గేట్లు తెరవబడే సమయం: సాయంత్రం 4:30 గంటలకు మాత్రమే స్టేజ్ ప్రారంభం: సాయంత్రం 6:00 గంటలకు మాత్రమే
పార్కింగ్ వివరాలు
- బోల్డర్ హిల్స్ పార్కింగ్
- సిల్వర్ & గోల్డ్ టికెట్ హోల్డర్లకు మాత్రమే
- కార్లు & బైక్‌లకు పార్కింగ్ అందుబాటులో ఉంది
- బైక్ పార్కింగ్ కేవలం ఇక్కడే అందుబాటులో ఉంటుంది
షటిల్ సర్వీస్ (పరిమిత బస్సులు మాత్రమే)
సంధ్యా కన్వెన్షన్ పార్కింగ్ గూగుల్ మ్యాప్ ఇదిగో
- ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ పద్ధతిలో పార్కింగ్ ఉంటుంది.
- ఫ్యాన్ పిట్ టికెట్ హోల్డర్లకు మాత్రమే
- కేవలం కార్లకు మాత్రమే
- షటిల్ సర్వీస్ (పరిమిత బస్సులు మాత్రమే)
- ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్
గచ్చిబౌలి స్టేడియం పార్కింగ్
రాక్‌స్టార్ ఫ్యాన్ పిట్ టికెట్ హోల్డర్లకు మాత్రమే
ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్
ముఖ్య సూచనలు
- టికెట్‌కు అనుగుణంగా కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు పార్క్ చేయాలి
- షటిల్ సర్వీస్ రాత్రి 11:00 గంటలకు ముగుస్తుంది
- ముందుగానే రావడం మంచిది
- క్యాబ్ డ్రాప్ & పికప్ పాయింట్
- స్టేడియం గేట్ సమీపంలో ట్యాక్సీ డ్రాప్ & పికప్ పాయింట్ ఏర్పాటు చేశారు.
- ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు ట్యాక్సీలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా కార్‌పూలింగ్ ఉపయోగించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
ముందుగానే ప్లాన్ చేసుకోండి!
సమయానికి ముందే వచ్చి, పార్కింగ్ & రవాణా ప్లాన్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా ఈ సంగీత వేడుకను ఆస్వాదించండి. ఈ రాత్రిని మరచిపోలేని అనుభూతిగా మార్చుకుందాం!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
