AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol: సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ ఎందుకు ఖరీదైనది? రెండింటి మధ్య తేడా, ప్రయోజనాలు ఏంటి?

Premium Petrol - Regular Fuel: సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ప్రీమియం పెట్రోల్ ధర సాధారణంగా లీటరుకు కొన్ని రూపాయలు ఎక్కువగా ఉంటుంది. తాజా ధరల పెంపు తర్వాత ఈ వ్యత్యాసం మరింత పెరిగింది. మెరుగైన పనితీరు, ఇంజిన్ రక్షణ పేరుతో కంపెనీలు ఈ అదనపు ధరను వసూలు చేస్తాయి. ప్రీమియం పెట్రోల్‌ను ఎంచుకోవడం వల్ల లీటరుకు ఎక్కువ ఖర్చయినా, దానితో పాటు కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

Petrol: సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ ఎందుకు ఖరీదైనది? రెండింటి మధ్య తేడా, ప్రయోజనాలు ఏంటి?
Premium Petrol Regular Fuel
Subhash Goud
|

Updated on: Mar 20, 2026 | 6:20 PM

Share

Premium Petrol – Regular Fuel: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు భారతదేశ ఇంధన మార్కెట్‌పై పడుతోంది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉండటంతో వినియోగదారులకు ఉపశమనం లభించగా, ప్రీమియం పెట్రోల్ ధర మాత్రం పెరిగింది. 20 మార్చి 20, 2026 నుండి అమలులోకి వచ్చేలా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ.2 నుండి రూ.2.3 వరకు పెంచాయి. సాధారణ పెట్రోల్ – ప్రీమియం పెట్రోల్ మధ్య ఉన్న తేడాను పరిశీలిద్దాం. వాటి ప్రయోజనాలు ఏమిటి? కంపెనీలు ఎక్కువ ధర వసూలు చేయడానికి గల కారణాలు ఏమిటి?

ప్రీమియం పెట్రోల్ ఖరీదైనది:

సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ప్రీమియం పెట్రోల్ ధర సాధారణంగా లీటరుకు కొన్ని రూపాయలు ఎక్కువగా ఉంటుంది. తాజా ధరల పెంపు తర్వాత ఈ వ్యత్యాసం మరింత పెరిగింది. మెరుగైన పనితీరు, ఇంజిన్ రక్షణ పేరుతో కంపెనీలు ఈ అదనపు ధరను వసూలు చేస్తాయి. ప్రీమియం పెట్రోల్‌ను ఎంచుకోవడం వల్ల లీటరుకు ఎక్కువ ఖర్చయినా, దానితో పాటు కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ఇది కూడా చదవండి: Zomato: ఇక బాదుడే.. బాదుడు.. ఫుడ్‌ ప్రియులకు భారీ షాక్‌ ఇవ్వబోతున్న జోమాటో..!

ఇవి కూడా చదవండి

ప్రీమియం పెట్రోల్ అంటే ఏమిటి?

ప్రీమియం పెట్రోల్ అనేది అధిక ఆక్టేన్ కలిగిన ఇంధనం. దీని ఆక్టేన్ సంఖ్య సాధారణంగా 95 నుండి 99 మధ్య ఉంటుంది. ఉదాహరణకు IOCL వారి XP95 పెట్రోల్ 95 ఆక్టేన్ రేటింగ్‌తో వస్తుంది. ఈ ఇంధనం అధిక కంప్రెషన్ లేదా అధిక పనితీరు అవసరమయ్యే ఇంజిన్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది మెరుగైన దహనాన్ని అందించి, ఇంజిన్ సజావుగా నడిచేలా చేస్తుంది.

సాధారణ పెట్రోల్ అంటే ఏమిటి?

సాధారణ లేదా రెగ్యులర్ పెట్రోల్ ఆక్టేన్ సంఖ్య 91గా ఉంటుంది. ఇది భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఇంధనం. ఇది రోజువారీ డ్రైవింగ్‌కు సరిపోతుంది. అలాగే దాదాపు అన్ని సాధారణ వాహనాలకు అనువైనది. దీని అతిపెద్ద ప్రయోజనం దాని తక్కువ ధర, సులభంగా లభిస్తుంది.

రెండింటి మధ్య అసలు తేడా ఏమిటి?

సాధారణ – ప్రీమియం పెట్రోల్ మధ్య అతిపెద్ద వ్యత్యాసం ఆక్టేన్ రేటింగ్. ప్రీమియం పెట్రోల్‌కు అధిక ఆక్టేన్ (95-99) ఉంటుంది. ఇది ఇంజిన్ నాకింగ్‌ను తగ్గిస్తుంది. మెరుగైన యాక్సిలరేషన్, సున్నితమైన డ్రైవింగ్‌ను అందిస్తుంది. శుభ్రమైన దహనం వలన ఉద్గారాలు తక్కువగా ఉంటాయి. మరోవైపు సాధారణ పెట్రోల్‌కు 91 ఆక్టేన్ రేటింగ్ ఉంటుంది. ఇది ప్రామాణిక ఇంజిన్‌లకు సరిపోతుంది.

కంపెనీలు ఎందుకు ఎక్కువ వసూలు చేస్తాయి?

ప్రీమియం పెట్రోల్‌లో అధిక ఆక్టేన్ స్థాయి ఉండటమే కాకుండా దానిలో ప్రత్యేక సంకలితాలు కూడా ఉంటాయి. ఈ సంకలితాలు ఇంజిన్‌ను శుభ్రంగా ఉంచుతాయి. కార్బన్ పేరుకుపోకుండా నివారిస్తాయి. పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా అధిక-ఆక్టేన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువజ అందుకే కంపెనీలు దానికి అదనంగా ఛార్జ్ చేస్తాయి.

మీకు నిజంగా ఏదైనా ప్రయోజనం కలుగుతుందా?

మీ వాహనానికి హై-పెర్ఫార్మెన్స్ లేదా టర్బోచార్జ్డ్ ఇంజన్ ఉన్నట్లయితే, ప్రీమియం పెట్రోల్ వాడటం వల్ల మెరుగైన ఇంధన సామర్థ్యం, ​​సున్నితమైన డ్రైవింగ్, ఇంజన్ ఎక్కువ కాలం మన్నిక వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే మీరు సాధారణ బైక్ లేదా కారు నడిపితే సాధారణ పెట్రోల్ సరిపోతుంది. ప్రీమియం పెట్రోల్ వల్ల కలిగే ప్రయోజనాలు అంత స్పష్టంగా ఉండవు.

ఇది కూడా చదవండి: భారీగా పడిపోతున్న వెండి ధర.. జస్ట్‌ 10 రోజుల్లో ఎంత తగ్గిందో తెలిస్తే అవాక్కవుతారు!

ఇది కూడా చదవండి: Diesel Price: దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us