AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఆహా ఐడియా అదిరింది గురూ.. కోతులను తరిమికొట్టేందుకు ఎలుగుబంటిగా మారిన సర్పంచ్

తెలంగాణలో సర్పంచ్‌లకు కోతుల బెడద పెను సవాలుగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి సర్పంచులు నానా తంటాలు పడుతున్నారు. నిర్మల్ జిల్లాలోని సూర్జాపూర్ సర్పంచ్ బక్కశెట్టి వెంకట్రాములు స్వయంగా చింపాంజీ మాస్క్‌ ధరించి కోతులను తరిమేస్తున్నాడు. పంటలను, ప్రజలను కాపాడుతూ గ్రామస్తులకు ఉపశమనం కలిగిస్తున్న ఈ వినూత్న పరిష్కారం ఇప్పుడు ట్రెండిగ్‌ మారింది.

Watch: ఆహా ఐడియా అదిరింది గురూ.. కోతులను తరిమికొట్టేందుకు ఎలుగుబంటిగా మారిన సర్పంచ్
Monkey Menace (1)
Naresh Gollana
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 6:02 PM

Share

తెలంగాణలో సర్పంచ్‌లకు కోతల కష్టాలు తప్పడం లేదు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచింది మొదలు కోతులను ఊర్ల నుండి తరమడమే ధ్యేయంగా పెట్టుకోక తప్పడం లేదు. ఎన్నికల్లో కోతుల బెడద తీరుస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు గెలిచిన సర్పంచులు నానా తిప్పలు పడుతున్నారు. కోతులను ఊర్ల నుండి తరిమేసేందుకు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నారు. కొండ ముచ్చులను తీసుకొచ్చినా ఫలితం లేకపోవడంతో సర్పంచ్ లే నేరుగా సంర్పంచ్‌లే రంగంలోకి దిగి కోతులను తరుముతున్నారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామంలో కోతుల బెడదా తారస్థాయికి చేరింది. పంట చేలల్లో, పొలాల్లో మందలు మందలుగా ఎగబడుతున్న కోతులు పంటనంత నాశనం చేస్తుండటంతో రైతుల బాధలు వర్ణనతీతంగా మారాయి. మరో వైపు గ్రామంలోని మహిళలపై, పిల్లలపై కోతుల దాడి చేస్తుండటంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో విసిగి వేశారని గ్రామస్తులు తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కోతుల బెడద తీరుస్తామంటూ హామీ ఇచ్చిన బక్కశెట్టి వెంకట్రాములుకు ఓటు వేసి గెలిపించారు. దీంతో గెలిచిన రోజునుండి మొదలు నేటి వరకు కోతులను తరమడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని పని చేస్తున్నారు కొత్త సర్పంచ్.

ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతులు పారిపోకపపోవడంతో తానే నేరుగా రంగంలోకి దిగారు. చింపాంజీ మాస్క్‌ను దరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కోతులు ఊర్లలో పంట పొలాల్లో విధ్వంసం సృష్టించకుండా చూస్తున్నారు. తమ ప్రాంతాల్లో కోతులు ఉన్నాయని రైతులు, స్థానిక ప్రజలు చెప్పడమే ఆలస్యం అక్కడ వాలిపోతున్నాడు సర్పంచ్. మిస్డ్ కాల్ చేసిన వెంటనే చింపాజీ వేశాధారణను వేసుకుని అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. కోతులను ఊర్ల నుండి సమీప అడవి వరకు తరిమేస్తున్నాని చెపుతున్నాడు. మూడు నెలలుగా కొనసాగుతున్న సర్పంచ్ కృషితో గత మూడు రోజులుగా తమ గ్రామంలో కోతులు కనిపించడం లేదని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో