AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తేజ సజ్జా టు కిరణ్ అబ్బవరం.. రూటు మారుస్తోన్న టాలీవుడ్ కుర్ర హీరోలు

టాలీవుడ్ యువ హీరోలు ఇప్పుడు వెండితెరకే పరిమితం కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు కేవలం సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చిన మన స్టార్లు, ఇప్పుడు ఓటీటీ కంటెంట్ వైపు ఆసక్తి చూపిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.

Tollywood: తేజ సజ్జా టు కిరణ్ అబ్బవరం.. రూటు మారుస్తోన్న టాలీవుడ్ కుర్ర హీరోలు
Teja Sajja, Kiran Abbavaram
Praveen Vadla
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 6:15 PM

Share

‘హను-మాన్’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ క్రేజ్ తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు ఓటీటీలో సరికొత్త అవతారంలో అలరించబోతున్నాడు. ఇంటర్నేషనల్ స్థాయిలో సూపర్ హిట్ అయిన ‘ది ట్రేటర్స్’ షో తెలుగు వర్షన్‌కి తేజ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఒక మైండ్ గేమ్ ఆధారంగా నడిచే ఈ రియాలిటీ షోకి ఒక యంగ్ హీరో హోస్ట్‌గా వ్యవహరించడం టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్. తన చురుకైన మాటలు, కాన్ఫిడెంట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో షోని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లగల సత్తా తేజకి ఉంది. ఈ ఓటిటి ట్రెండ్‌కి పర్ఫెక్ట్ ఉదాహరణ అక్కినేని నాగ చైతన్య. ఆయన నటించిన ‘దూత’ వెబ్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సూపర్ హిట్ సిరీస్‌కి సీక్వెల్‌గా ‘దూత 2’ రాబోతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పైన అంచనాలు భారీగా ఉన్నాయి. తొలి భాగం ఇచ్చిన కిక్‌తో, రెండో భాగంలో చైతూ ఎలాంటి మిస్టరీలు ఛేదిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఓటీటీ రేసులో డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ముందుకు వస్తున్న మరో ఇద్దరు హీరోలు కిరణ్ అబ్బవరం, సుధీర్ బాబు. మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న కిరణ్ అబ్బవరం.. ‘గువ్వలచెరువు ఘాట్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుంది.

మరోవైపు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకునే సుధీర్ బాబు ‘గల్లీ’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సిరీస్ లోకల్ పాలిటిక్స్ లేదా ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది ఇది. జేడీ చక్రవర్తి సైతం ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా వాళ్ళ కెరీర్‌కి ఓటీటీలో మంచి బూస్ట్ ఇస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక తనదైన స్టైల్ యాక్టింగ్‌తో ఎప్పుడూ ప్రయోగాలు చేసే యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా డిజిటల్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఓటీటీ కంటెంట్ పట్ల మంచి అవగాహన ఉన్న సందీప్.. ఈసారి ‘సూపర్ సుబ్బు’ అనే ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. టైటిల్ వింటుంటేనే ఇదొక ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తోంది. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ మరియు కామిక్ టైమింగ్ ఉన్న సందీప్‌కి ఇలాంటి క్యాచీ క్యారెక్టర్స్ చాలా ఈజీగా సెట్ అయిపోతాయి.

ఇవి కూడా చదవండి

వెండితెరపై విభిన్నమైన సినిమాలు చేస్తూనే, ఓటీటీలో యువతను ఆకట్టుకోవడానికి సందీప్ వేసిన ఈ అడుగు కచ్చితంగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో పాటే రియాలిటీ షోల వైపు కూడా మన యంగ్ హీరోలు దృష్టి పెడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలు గిరి గీసుకుని కూర్చోకుండా డిజిటల్ మార్పులను చాలా వేగంగా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఒకవైపు థియేటర్లలో తమ సినిమాలతో ప్రేక్షకులను రంజింపజేస్తూనే, మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందిస్తున్న స్వేచ్ఛను ఉపయోగించుకుని వినూత్న కథలతో ప్రయోగాలు చేస్తున్నారు. ‘దూత 2’ లాంటి థ్రిల్లర్ అయినా, ‘గువ్వలచెరువు ఘాట్’, ‘గల్లీ’ లాంటి ఇంటెన్స్ డ్రామాలైనా.. లేదా ‘సూపర్ సుబ్బు’ లాంటి ఎంటర్‌టైనర్, ‘ది ట్రేటర్స్’ లాంటి మైండ్ గేమ్ రియాలిటీ షో అయినా.. ఇవన్నీ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచబోతున్నాయి. ముందు ముందు ఇంకెంతమంది హీరోలు ఈ ఓటీటీ బాట పడతారో వేచి చూడాలి!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి
IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?