AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు 20 రాశి ఫలాలు: ఈ రాశులకు కెరీర్‌లో శుభవార్త.. ఆర్థికంగా అదృష్టం!

Horoscope Today (20 August 2026): గురువారం 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మేష రాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు కనిపిస్తాయి. వృషభ రాశి వారికి ఆదాయం పెరిగినా కుటుంబ ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ప్రమోషన్‌తో పాటు అధికారుల ప్రోత్సాహం లభించే సూచనలు ఉన్నాయి. మరి మేషం నుంచి మీనం వరకు మిగిలిన రాశుల వారికి గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ఆగస్టు 20 రాశి ఫలాలు: ఈ రాశులకు కెరీర్‌లో శుభవార్త.. ఆర్థికంగా అదృష్టం!
Horoscope Today 20 August 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 20, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (ఆగస్టు 20, 2026): మేష రాశి వారు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయంతో సమానంగా కుటుంబ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. డబ్బు ఒక పట్టాన చేతిలో నిలవదు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మాటకు, చేతకు సర్వత్రా విలువ పెరుగుతుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయపడ తారు. సంపాదన బాగా పెరుగుతుంది. అందుకు దీటుగా ఖర్చులు పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయంతో సమానంగా కుటుంబ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. డబ్బు ఒక పట్టాన చేతిలో నిలవదు. ఇతర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవ హారాలు, పనులు సకాలంలో పూర్తతాయి. బంధుమిత్రులకు అవసరమైనప్పుడు సహాయ సహకా రాలు అందిస్తారు. మంచి స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపో తాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా కొనసాగుతుంది. సమయం అనుకూలంగా ఉన్నందు వల్ల ఆదాయ ప్రయత్నాలను బాగా వృద్ధి చేయడం మంచిది. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్ర త్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరుల బాధ్యతల్ని నెత్తికెత్తు కుని ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగు తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. బంధువులతో కొన్ని అనుకోని చికాకులుంటాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో పనిభారం పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా నిదానంగా పురోగమిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దగ్గర బంధువులతో ఆస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఆశించిన సానుకూల ఫలితాలనిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వీలైనంతగా వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసు కుంటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్ లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్ని సంతృప్తికరంగా చక్కబెడతారు. ఖర్చులు చాలావరకు అదుపులో ఉంటాయి. పొదుపు మార్గాలు అనుసరిస్తారు. మిత్రుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారం చేపట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో బంధువుల జోక్యం వల్ల ఇబ్బంది పడతారు. సొంత ఆలోచనలు మంచివి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆలయ దర్శనం చేసు కుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటుంది. బంధువుల నుంచి ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేసి లాభపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరిగే అవకాశముంది. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవు తాయి. ఆస్తి వివాదం విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. సోదర వర్గం నుంచి ఊహించని ఇబ్బందులు తలెత్తవచ్చు. తల్లితండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూలతలు కనిపిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలకు అవకాశముంది. మీ శక్తి సామర్థ్యాల మీద అధికారులకు నమ్మకం ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు సాను కూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.

Follow Us