AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రుడి అనుగ్రహంతో అదృష్టం పట్టబోయే రాశులివే..! లిస్ట్‌‌లో మీ రాశి ఉందా?

Chandra Mangal Yoga 2026: ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ధనుస్సు రాశిలో సంచరించే చంద్రుడితో కుజుడికి చంద్ర మంగళ యోగం, గురువుతో పరివర్తన యోగం ఏర్పడనున్నాయి. జ్యోతిష్య పరంగా ఈ మూడు రోజుల గ్రహ సంచారం కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకురావచ్చని అంచనా. ముఖ్యంగా మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంది.

చంద్రుడి అనుగ్రహంతో అదృష్టం పట్టబోయే రాశులివే..! లిస్ట్‌‌లో మీ రాశి ఉందా?
Lucky Zodiac SignsImage Credit source: Getty Images
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2026 | 4:36 PM

Share

జాతక చక్రంలోనూ, గ్రహ సంచారంలోనూ చంద్రుడితో ఏర్పడే యోగాలు అత్యంత శుభ ఫలితాలనిస్తాయి. గ్రహచారంలో చంద్రుడితో ఏర్పడే ఏ యోగమైనా మూడు రోజులు మాత్రమే ఉండడం జరుగుతుంది కానీ, జీవితం మీద ఆ యోగ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది జీవన గతినే మార్చేసే అవకాశం ఉంటుంది. ఈ నెల (ఆగస్టు) 23, 24, 25 తేదీల్లో ధనూ రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడితో కుజుడికి చంద్ర మంగళ యోగంతో పాటు, గురువుతో పరివర్తన యోగం కూడా కలుగుతోంది. దీనివల్ల మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది.

  1. మేషం: రాశ్యధిపతి కుజుడితో చంద్రుడికి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల చంద్ర మంగళయోగం, గురు వుతో పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి, పెళ్లికి, ఉద్యోగానికి చేపట్టే ప్రయత్నాలు నూరు శాతం సక్సెస్ అవుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. శుభవార్తలు ఎక్కువగా ఉంటారు. ఊహించని ఐశ్వర్య యోగం పడుతుంది.
  2. మిథునం: ఈ రాశిలో ఉన్న కుజుడితో చంద్ర మంగళ యోగం, ధన స్థానంలో ఉన్న గురువుతో పరివర్తన యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. రావల సిన సొమ్ము చేతికి అందడం, మొండి బాకీలు సైతం వసూలు కావడంతో పాటు ఆస్తి మీదలభించే ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. సంపన్నకుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
  3. కన్య: ఈ రాశికి చంద్ర మంగళ, పరివర్తన యోగాలకు చతుర్థ స్థానంతో సంబంధం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. పలుకుబడి వృద్ధిచెందుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతో షాలు వృద్ధి చెందుతాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. శుభ కార్యాలు తలపెట్టే అవకాశం ఉంది.
  4. తుల: ఈ రాశికి తృతీయ, భాగ్య, దశమ స్థానాలలో ఈ రెండు మహాయోగాలు కలగడం వల్ల శుభ వార్తలు ఎక్కువగా వినడం, శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. భూలాభం, ఆస్తి లాభం కలుగుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: ఈ రాశికి ధన, భాగ్యాధిపతుల పరివర్తన జరగడంతో పాటు రాశ్యధిపతి కుజుడితో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం ఫలిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు విశేషంగా లాభిసాయి. విదేశీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
  7. మీనం: ఈ రాశికి చతుర్థ, దశమ, పంచమ స్థానాలతో చంద్ర మంగళ, పరివర్తన యోగాలు ఏర్పడినందు వల్ల రాజయోగాలు, ధన యోగాలు ఎక్కువగా కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్లే అవకాశం కలుగు తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం కూడా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. సంతాన యోగం కలిగే సూచనలున్నాయి.

(గమనిక: పైన పేర్కొన్న ఫలితాలు జ్యోతిష్య విశ్వాసాలు, గోచార ఆధారిత సాధారణ అంచనాలు మాత్రమే. ఇవి శాస్త్రీయంగా నిరూపితమైన కావు)

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర