AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రవి, బుధుల యుతి.. త్వరలో రాజభోగాలు పట్టే రాశులివే..! కష్టాల నుంచి విముక్తి

Budhaditya Yoga: ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు సింహ రాశిలో రవి, బుధ గ్రహాల కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. సహజ రాజయోగ స్థానమైన సింహంలో ఈ యోగం ఏర్పడటంతో 15 రోజుల పాటు కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి కీలక సమస్యలు పరిష్కారం కావడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి.

రవి, బుధుల యుతి.. త్వరలో రాజభోగాలు పట్టే రాశులివే..! కష్టాల నుంచి విముక్తి
Budhaditya Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2026 | 2:50 PM

Share

ఈ నెల(ఆగస్టు) 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు సింహ రాశిలో రవి, బుధ గ్రహాల కలయిక జరుగుతోంది. బుధాదిత్య యోగంగా, సూక్ష్మబుద్ధి యోగంగా జ్యోతిషశాస్త్రం అభివర్ణిస్తున్న ఈ రవి, బుధ యుతి సహజ రాజయోగ స్థానమైన సింహ రాశిలో చోటు చేసుకోవడం వల్ల ఓ పదిహేను రోజుల పాటు జీవితం రాజభోగాలతో సాగిపోయే అవకాశం ఉంటుంది. ఈ యోగం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి గ్రహ సంచారంలో ఎన్ని దోషాలు ఉన్నా కొట్టుకుపోతాయి. కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విపరీతంగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది.

  1. మేషం: పంచమ స్థానంలో రవి, బుధుల యుతి వల్ల ఈ రాశివారు తమ రంగంలో ఒక వెలుగు వెలుగు తారు. నైపుణ్యాలు పెరుగుతాయి. ప్రతిభకు, ఆలోచనలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభి స్తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. గడ్డు సమస్యల నుంచి పూర్తిగా బయట పడడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల సంస్థలు లబ్ధి పొందుతాయి.
  2. వృషభం: ఈ రాశికి బుధ, రవులిద్దరూ శుభ గ్రహాలైనందువల్ల, చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడు తున్నందు వల్ల ఈ రాశివారు ఎక్కువగా సత్ఫలితాలను పొందడం జరుగుతుంది. ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి పేరు లభిస్తుంది. అత్యధికంగా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాలు అమ రుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు.
  3. కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. కుటుంబపరంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది.
  4. సింహం: ఈ రాశిలో రాశ్యధిపతి రవితో బుధుడు యుతి చెందుతున్నందువల్ల రాజపూజ్యాలు కలుగు తాయి. రాజయోగాలు పడతాయి. ఉద్యోగంలో అధికారం చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టి విటీ పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయి, మనశ్శాంతి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల మెరుగుదలకు ఎటువంటి ప్రయ త్నం తలపెట్టినా సఫలం అవుతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. తుల: ఈ రాశికి లాభ స్థానంలో రవి, బుధులు కలుస్తున్నందువల్ల నైపుణ్యాలు బాగా వృద్ధి చెందు తాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు తదితర మార్గాల ద్వారా అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభా లకు లోటుండదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కలలో కూడా ఊహించని విధంగా ప్రము ఖుల పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖుడిగా గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.
  7. ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో రవి, బుధులు కలవడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం లభి స్తుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా ఇతర దేశా లకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆదాయానికి లోటుండదు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందు తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
  8. కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం పట్టడం వల్ల కెరీర్ పరంగా పురోగతి చెందడం, ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడం, మంచి ఉద్యోగంలోకి మారడానికి మార్గం సుగమం కావడం, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరగడం వంటివి జరుగుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది.

Follow Us