AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Gochar: బుధుడి కటాక్షంతో ఇక వారికి కొత్త జీవితం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Mercury Transit 2026: ఆగస్టు 23న బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. సెప్టెంబర్ 7 వరకు సింహరాశిలో కొనసాగనున్న బుధుడి సంచారం ప్రభావంతో వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి ఆదాయం, అధికారానికి సంబంధించిన అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో కొన్ని ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2026 | 5:16 PM

Share
సాధారణంగా గ్రహాలు రాశి మారినప్పుడల్లా వివిధ రాశుల వారి జీవితాల్లో కొద్దో గొప్పో మార్పులు జరుగుతుంటాయి. అందులోనూ బుధుడు వంటి చురుకైన గ్రహం రాశి మారినప్పుడు తప్ప కుండా కొన్ని రాశుల వారి జీవితాల్లో సత్వర మార్పులు చోటు చేసుకుంటాయి. బుద్ధి కారకుడైన బుధుడు ఈ నెల(ఆగస్టు) 23న కర్కాటక రాశిని వదిలి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సెప్టెంబర్ 7 వరకూ ఇదే రాశిలో కొనసాగే బుధ గ్రహం వల్ల వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశి వారికి జీవితాలను మలుపు తిప్పగల ఆదాయ యోగాలు, అధికార యోగాలు పట్టే అవకాశం ఉంది. కొన్ని ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు సాకారం అవుతాయి.

1 / 7
వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు చతుర్థ స్థానంలో ప్రవేశించడం ఈ రాశివారి వ్యూహాలు, ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపారంగా లాభిస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలమై, ఆదాయం పెరుగుతుంది. సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరుతాయి.  ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్, యాక్టివిటీలు బాగా విస్తరిస్తాయి.

2 / 7
కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో బుధుడి సంచారం వల్ల వీరికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, షేర్లు, స్పెక్యు లేషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వీరి సలహాలు, సూచనల వల్ల అధికారులు బాగా లబ్ధి పొందుతారు. ఉద్యో గంలో హోదా, జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరగడం వంటివి జరుగు తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

3 / 7
సింహం: ఈ రాశిలో బుధుడు ప్రవేశించినప్పటి నుంచి ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడం ప్రారంభం అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలకు బాగా డిమాండ్ పెరుగుతుంది.

4 / 7
తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల అనేక విదేశీ అవకాశాలు అందివస్తాయి. విదేశీ సొమ్ము తినే యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారికి విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. తండ్రి వైపు నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయ వృద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

5 / 7
వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగపరంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వీరి సలహాలు, సూచనల వల్ల సంస్థలు లబ్ధి పొందుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడడం మొదలవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

6 / 7
ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో దశమాధిపతిగా బుధుడి సంచారం వల్ల విదేశీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందు తాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమవుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలు వెళ్ల వలసి వస్తుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. దాంపత్యంలో అన్యోన్యత వృద్ది చెందుతుంది.

7 / 7
Follow Us