AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jupiter Transit: సింహ రాశిలోకి గురువు.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త!

కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచరిస్తున్న గురువు ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆదాయం, ఆస్తులు, ఆర్థిక స్థిరత్వం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు గురువు సింహ రాశిలోకి మారనున్న నేపథ్యంలో వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు ఖర్చులు, ఆర్థిక వ్యవహారాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Jupiter Transit: సింహ రాశిలోకి గురువు.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త!
Money Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2026 | 4:33 PM

Share

ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న ధన కారకుడు గురువు వల్ల కొన్ని రాశుల వారు ఆదాయపరంగా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. జీవనశైలి మారిపోవడం, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడం, బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందడం, ఆస్తులు కొనుగోలు చేయడం, మనసులోని కోరికలు తీరడం వంటివి జరుగుతాయి. అయితే, అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు గురువు సింహ రాశిలో సంచారం చేయడంతో వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఈ పరిస్థితి తలకిందులయ్యే అవకాశం ఉంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఇప్పటి నుంచే వీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

వృషభం

ఈ రాశికి అత్యంత పాపి అయిన గురువు ఈ రాశికి చతుర్థ స్థానంలో ప్రవేశించడం ఏమంత మంచిది కాదు. గృహ, వాహన సౌకర్యాల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. అనవసర ఖర్చు లతో పాటు అనుకోని ఖర్చులు కూడా అదుపు తప్పుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల మీద ఖర్చులు పెరుగుతాయి. కష్టార్జితం బాగా పెరిగినా చివరికి చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడు తుంది. ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి.

మిథునం

ఈ రాశికి ప్రస్తుతం ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు తృతీయ స్థానంలోకి మారడం వల్ల జనవరి 25 వరకు ఈ రాశివారికి ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. పనులు, ప్రయత్నాలన్నీ వ్యయ ప్రయాసలతో సాగుతాయి. ప్రయాణాల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగు తుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. నష్టదాయక వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. ఇచ్చిన డబ్బు తిరిగి రాదు. డబ్బు దాచుకోవడానికి, మదుపు చేయడానికి అవకాశం ఉండదు.

ఇవి కూడా చదవండి

కన్య

ఈ రాశికి వ్యయ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి వ్యక్తిగత సుఖ సంతోషాల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆధునిక వస్త్రాలు, వస్తువులు, సౌందర్య సాధనాలు, అలంకార వస్తువులు, వస్త్రాభరణాల మీద ఖర్చు ఎక్కువగా జరుగుతుంది. ప్రేమ భాగస్వామి మీద కూడా ఖర్చు వృద్ధి చెందుతుంది. వైద్య ఖర్చులు కూడా కాస్తంత ఎక్కువగా ఉంటాయి. విలాసాలు, వ్యస నాలతో వ్యయ భారం బాగా పెరుగుతుంది. విహార యాత్రలు, హనీమూన్లు ఎక్కువగా చేస్తారు.

వృశ్చికం

ఈ రాశికి ప్రస్తుతం భాగ్య స్థానంలో ఉన్న గురువు దశమ స్థానంలోకి మారడం వల్ల సమస్యలు, వివాదాల పరిష్కారం మీద బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వృథా ఖర్చులు, అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందకపోవడం వల్ల రుణ సమస్యలు పెరుగుతాయి. వ్యయ ప్రయాసలతో గానీ ఏ పనీ పూర్తి కాదు. పెద్దల అనారోగ్యాల మీద ఖర్చు పెరుగుతుంది. ఖర్చుల మీద అదుపుండదు. ప్రయాణాల మీద కూడా ఖర్చులు తప్పకపోవచ్చు.

మకరం

ఈ రాశికి అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల కుటుంబం మీదా, జీవిత భాగస్వామి మీదా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందదు. ఆర్థిక లావాదేవీలు నష్టాలు కలిగిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాల మీద అదనపు పెట్టుబడులు అవసరమవుతాయి. వీరి ఖర్చులు ఆదాయంతో పోటీపడుతుంటాయి. సుఖ సంతోషాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. రుణ సమస్యలకు పెరిగే అవకాశం ఉంది.

మీనం

రాశ్యధిపతి గురువు షష్ట స్థానంలో సంచారం వల్ల ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. ఇంత వరకూ సంపాదించిన ధనం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. కష్టార్జితం కొద్దిగా పెరిగినా చేతిలో ఒక పట్టాన డబ్బు నిల వకపోవచ్చు. వృథా ఖర్చులకు తోడు, అనేక విధాలుగా ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా నష్టపోయేది ఈ రాశి వారే.

Follow Us