AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jupiter Blessings: గురువు నక్షత్ర మార్పు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

Jupiter Nakshatra Transit 2026: ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు ఆశ్లేష నక్షత్రంలో సంచరించనున్నాడు. కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు ఈ సంచారంతో మరింత బలపడి కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశుల వారికి అనుకున్న పనులు సఫలమయ్యే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు.

Jupiter Blessings: గురువు నక్షత్ర మార్పు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
Jupiter Nakshatra Transit 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 14, 2026 | 7:04 PM

Share

ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న గురువు ఈ నెల (ఆగస్టు) 18 నుంచి మరింత బలవంతుడై, మరింత శుభ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 31 వరకు ధన కారకుడైన గురువు బుద్ధి కారకుడైన బుధుడికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారు తప్పకుండా శుభ ఫలితాలను అనుభవించే అవకాశం ఉంది. 27వ తేదీ నుంచి స్వతంత్రంగా ఫలితాలనివ్వడం ప్రారంభం అవుతుంది. ఎటువంటి ప్రయత్నమైనా సఫల మవుతుంది. ఎటువంటి జటిల సమస్య అయినా పరిష్కారమవుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశుల వారు పట్టిందల్లా బంగారం అవుతుంది.

వృషభం

ఈ రాశికి బుధుడు అత్యంత శుభుడైనందువల్ల ఈ గ్రహానికి చెందిన నక్షత్రంలో గురు సంచారం ధన, రాజయోగాలనిస్తుంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. ప్రము ఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగు తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది.

మిథునం

రాశ్యధిపతి బుధుడికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో ధన కారకుడు గురువు సంచారం వల్ల ఆదాయం దాదాపు రెట్టింపు అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఉద్యో గంలో జీత భత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతాయి. మరింత మంచి ఉద్యోగంలో రావడానికి అవకాశాలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటకం

భాగ్యాధిపతి గురువు బుద్ధి కారకుడైన బుధుడికి చెందిన ఆశ్లేషలో సంచారం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతితో కూడిన స్థాన చలన సూచనలున్నాయి. ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. పట్టిందల్లా బంగారం అవు తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, హోదాలు పెరుగుతాయి. మరింత మెరుగైన ఉద్యోగంలోకి మార డానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.

కన్య

లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు రాశ్యధిపతి బుదుడికి చెందిన నక్షత్రంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి గృహ, వాహన యోగాలు పట్టడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ప్రభుత్వమూలక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాతోపాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు తప్ప నష్టాలకు అవకాశం ఉండదు.

మకరం

ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న ధన కారకుడు గురువు భాగ్యాధిపతి బుదుడికి చెందిన నక్షత్రంలో సంచారం చేయడం వల్ల, అనేక విధాలుగా ధనాభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

మీనం

పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాశ్యధిపతి గురువు ఆశ్లేషలో సంచారం వల్ల, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవడం లేదా ఒక సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి.

Follow Us