AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?

పెళ్లి రెండు అక్షరాలే అయినా ఇది ఇద్దరు వ్యక్తుల నూరేళ్లు జీవితానికి నాంది. ఇక ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక్కసారి మాత్రమే అవుతుంది. కానీ అక్కడ మాత్రం పెళ్లైన వారే రెండు సార్లు వివాహం చేసుకుంటారంట. కాగా, అసలు దీని వెనకున్న కథ ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Aug 19, 2026 | 5:48 PM

Share
కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పెళ్లయిన 9 జంటలు, మళ్లీ పెళ్లి చేసుకున్నారు. భార్య భర్తలు..కుటుంబ సమస్యలు ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగుతాయనే విశ్వాసంతో, మరోసారి వివాహం  చేసుకున్నామని చెబుతున్నారు జంటలు.

1 / 5
ఒకసారి పెళ్లిచేసుకున్న ముహూర్తం గడియలు బాగ లేనప్పుడు వచ్చే సమస్యలు నుండి.. మళ్ళీ మంచి ముహూర్తంలో రెండోసారి పెళ్లి చేసుకుంటే సమస్యలు, అప్పలు బాధల నుంచి విముక్తి లభిస్తుందనే  నమ్మకంతో వివాహాలు చేసుకున్నామని వారు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా వీరు తమ వైవాహిక జీవితం బాగుండాలని ఈ నిర్ణయం తీసుకున్నారంట.

2 / 5
ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజిస్టు నారాయణమూర్తి సలహాతో రెండోసారి పెళ్లి చేసుకున్నారు తొమ్మిది జంటలు, సత్యదేవుని సన్నిధిలో సంప్రదాయబద్ధంగా వేద మంత్రాల నడుమ మరోసారి మాంగళ్యధారణ గావించి వ్రతమా చరించారు.

3 / 5
 భార్యా,భర్తలు..మళ్లీ పెళ్లి చేసుకున్న జంటల్లో కొందరికి ఇప్పటికే సంతానం ఉండగా, కొంతమంది జంటల పిల్లలు పెద్ద వయసులో ఉండటం కొసమెరుపు. వీరు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్లకు చెందినవారు.

4 / 5
 విశాఖ జిల్లా ఆనందపురం నుంచి  6 జంటలు వివాహం చేసుకున్నారు , అన్నవరం ఆలయంలో ఆసక్తికరంగా మారాయి పెళ్లయిన జంటలు మరో సారి మాంగళ్యధారణ తంతు. ప్రస్తుతం దీనికి సంబంధించన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

5 / 5
Follow Us