AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2 : పరమ చెత్త సినిమా.. థియేటర్‌లో నిద్రపోయా.. ధురంధర్ 2పై హీరోయిన్ షాకింగ్ రివ్యూ

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ సినిమా ‘ధురందర్ 2: ది రివెంజ్’. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 3 గంటల 30 నిమిషాలు ఉన్న ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించాడని అంటున్నారు అడియన్స్.

Dhurandhar 2 : పరమ చెత్త సినిమా.. థియేటర్‌లో నిద్రపోయా.. ధురంధర్ 2పై హీరోయిన్ షాకింగ్ రివ్యూ
Dhurandhar 2
Rajeev Rayala
|

Updated on: Mar 20, 2026 | 6:39 PM

Share

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కేవలం బాలీవుడ్ లోనే కాదు ఈ సినిమా ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది ధురంధర్ సినిమా. గతేడాది డిసెంబర్లలో రిలీజైన ధురంధర్ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తాజాగా ధురంధర్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మార్చ్ 19న ధురంధర్ ది రివెంజ్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. హిందీతో పాటు అన్ని భాషల్లో ధురంధర్ 2 సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది.

ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు అవమానించారు.. షూటింగ్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్లా..

ఇక ధురంధర్ 2 సినిమాకు మొదటి రోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయని టాక్ వినిపిస్తుంది. మొదటి రోజు ఈ సినిమా థియేటర్లలో రూ. 103 కోట్ల వరకు వసూలు చేసింది. ఇది కేవలం భారతదేశవ్యాప్త వసూళ్లు మాత్రమే. ఈ చిత్రాన్ని మొదటి రోజు ప్రత్యేక ప్రదర్శనల ద్వారా కూడా విడుదల చేశారు. దీని ద్వారా రూ. 43 కోట్లు వసూలు కాగా, నివేదిక ప్రకారం మొదటి రోజు మొత్తం వసూళ్లు సుమారు రూ. 172.63 కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ధురంధర్ 2 సినిమా పై ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

సినిమా చెత్తగా ఉంది.. నాకు అస్సలు నచ్చలేదు, థియేటర్ లో నిద్రపోయాను అని చెప్పి షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. తాజాగా ధురంధర్ 2 సినిమా పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇప్పుడే ధురందర్ 2 సినిమాను చూశాను. మన సహనానికి పరీక్షలా ఉంది సినిమా. దయచేసి థియేటర్‌లో చూసి టైం, మనీ వెస్ట్ చేసుకోకండి. ఇది ఓటీటీలో చూసే సినిమా. సినిమా పరమ చెత్తగా ఉంది. మార్చి 19న విడుదల ఉందని వాళ్లకు ఎవరూ చెప్పలేదేమోనని అనిపించింది. పార్ట్‌-1 ఫర్వాలేదు కానీ,  ధురందర్ 2  నిరాశపర్చే సినిమా. అంతంత మాత్రంగానే ఉంది. ఇది ప్రేక్షకుడిని నిద్రపుచ్చే ఓ కామెడీ సినిమా. రణ్‌వీర్.. నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు.

Actress : రెండు పెళ్లిళ్లు.. మరో ఇద్దరితో ప్రేమాయణం..!! కట్ చేస్తే తనకన్నా 13 ఏళ్లుపెద్ద వాడితో….

OTT Movie : ముగ్గురు భామలు, వణికించే సీన్స్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us