AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్.. మహిళలకు 1500 రూపాయలు, నిరుద్యోగులకు పాకెట్ మనీ.. పోటా పోటీ హామీల వర్షం..!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మేనిఫెస్టోను విడుదల చేశారు. "లక్ష్మీ భండార్" పథకం కింద, సాధారణ వర్గానికి చెందిన మహిళలకు నెలకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1,700 ఆర్థిక సాయాన్ని టీఎంసీ పార్టీ ప్రకటించింది.

గుడ్‌న్యూస్.. మహిళలకు 1500 రూపాయలు, నిరుద్యోగులకు పాకెట్ మనీ.. పోటా పోటీ హామీల వర్షం..!
Bengal Cm Mamata Banerjee Releases Tmc Manifesto
Balaraju Goud
|

Updated on: Mar 20, 2026 | 5:57 PM

Share

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మేనిఫెస్టోను విడుదల చేశారు. “లక్ష్మీ భండార్” పథకం కింద, సాధారణ వర్గానికి చెందిన మహిళలకు నెలకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1,700 ఆర్థిక సాయాన్ని టీఎంసీ పార్టీ ప్రకటించింది. నిరుద్యోగ యువతకు ప్రతి నెలా పాకెట్ మనీ ఖర్చుగా రూ.1,500 అందుతాయని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

మేనిఫెస్టో ప్రకటిస్తూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, “బెంగాల్ పరిశ్రమలకు ఒక గమ్యస్థానం. ఎంఎస్ఎంఈలో మనం నంబర్ వన్ స్థానంలో ఉన్నాం, 1.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఇంటింటికీ ఆరోగ్య సేవలను (‘దౌరే చికిత్స’) ప్రారంభిస్తామని మమతా హామీ ఇచ్చారు. ప్రతి బూత్‌లోనూ దీనిని ప్రారంభిస్తామమన్నారు. వేలాది పాఠశాలలను ఇ-లెర్నింగ్ సౌకర్యాలతో ఆధునీకరణతోపాటు రాబోయే రోజుల్లో, 7-8 కొత్త జిల్లాలు, బ్లాక్‌లు, కొత్త మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు.

తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ బడ్జెట్‌ను పెంచుతున్నట్లు టీఎంసీ అధినేత్రి ప్రకటించారు. “వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు సహాయపడటానికి, భూమిలేని రైతులకు మద్దతు ఇవ్వడానికి, వ్యవసాయ రంగాన్ని మరింత మెరుగుపరచడానికి రూ. 30,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్‌ను అందించడానికి కట్టుబడి ఉన్నానని మమతా బెనర్జీ తెలిపారు. అదనంగా, ఇంటింటికీ వైద్య సేవలు అందేలా చూసేందుకు ప్రతి బ్లాక్, పట్టణంలో వైద్య శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “టీఎంసీ తప్ప మరే పార్టీ బెంగాల్‌ను కాపాడలేదని, ప్రధాని మోదీ ప్రసంగాన్ని పట్టించుకోవద్దన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us