AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల్లె మొక్క పూయటం ఆగిపోయిందా..? ఇలా చేశారంటే.. చెట్టు నిండా పూలతో మళ్లీ కళకళలాడుతుంది!

మల్లె పూలంటే ఇష్టపడని వారుండరు. చాలా మంది తమ పెరట్లో లేదా కుండీల్లో మల్లె మొక్కలను పెంచుతుంటారు. అయితే, ఎండాకాలంలో మల్లెపూలు విపరీతంగా పూస్తాయి. కానీ, సీజన్‌ పూర్తి కాకమునుపే పూలు రావటం ఆగిపోతుంది. మొక్క బాగానే పెరుగుతున్నా పూలు మాత్రం పూయడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. మీరు కూడా ఇలాగే ఫీల్‌ అవుతున్నారా..? ఇది మీ కోసమే.. మల్లె మొక్క నిండా మొగ్గలు రావాలంటే ఈ క్రింది చిట్కాలను అనుసరించండి.

Jyothi Gadda
|

Updated on: Apr 25, 2026 | 8:40 AM

Share
ఇంట్లో పెంచుకునే మల్లె మొక్క (Jasmine Plant) ఆశించిన రీతిలో పూలు పూయకపోవడానికి గల కారణాలు, మల్లె పందిరి పూలతో కళకళలాడటానికి పాటించాల్సిన సులభమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇందుకోసం ముఖ్యంగా మల్లె మొక్క సూర్యరశ్మిని బాగా ఇష్టపడుతుంది. మల్లె మొక్క ఏపుగా పెరుగుతున్నా పూలు పూయకపోవడానికి ప్రధాన కారణం సరైన పోషకాలు అందకపోవడం లేదా సూర్యరశ్మి లోపించడం. మొక్కను నీడలో ఉంచితే కేవలం ఆకులు మాత్రమే పెరుగుతాయి.

1 / 5
మల్లె మొక్కకు కనీసం రోజుకు 6 నుండి 8 గంటల పాటు ఎండ తగిలేలా చూడాలి. మొక్క మొదట్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. మల్లె మొక్క పూలు పూయడం తగ్గినప్పుడు మొక్కకు ప్రూనింగ్ చేయడం చాలా అవసరం. ఎండిపోయిన కొమ్మలను, పాత ఆకులను కత్తిరించండి. దీనివల్ల మొక్కకు కొత్త శక్తి వచ్చి, కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. ఈ కొత్త చిగుర్లకే మొగ్గలు ఎక్కువగా వస్తాయి.

2 / 5
మల్లె మొక్కకు రసాయన ఎరువుల కంటే సహజ సిద్ధమైన ఎరువులు బాగా పనిచేస్తాయి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది పూలు పూయడానికి ఎంతో తోడ్పడుతుంది. రోజూ బియ్యం కడిగిన నీటిని పారబోయకుండా మొక్క మొదట్లో పోయండి. ఇందులో ఉండే ఖనిజాలు మొక్క ఎదుగుదలకు సహకరిస్తాయి. వాడిన టీ పొడిని శుభ్రంగా కడిగి ఎండబెట్టి మట్టిలో కలిపితే నత్రజని అందుతుంది.

3 / 5
 మొక్క మొదట్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. మల్లె మొక్కకు మట్టి తడిగా ఉండాలి కానీ, నీరు నిల్వ ఉండకూడదు. కుండీలో నీరు నిలిచిపోతే వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. మట్టి పైపొర ఆరిపోయినప్పుడు మాత్రమే నీరు పోయండి. అలాగే, ఇంట్లోనే దొరికే బియ్యం కడిగిన నీరు లేదా అరటిపండు తొక్కల ఎరువును వేయడం వల్ల నేలలో పొటాషియం పెరిగి పూలు సమృద్ధిగా పూస్తాయి.

4 / 5
మొక్కకు తెల్ల దోమలు లేదా ఇతర పురుగులు పట్టినప్పుడు పూలు పూయవు. వారం లేదా పది రోజులకు ఒకసారి వేప నూనెను (Neem Oil) నీటిలో కలిపి మొక్కపై స్ప్రే చేయడం వల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ, పరిమిత పోషణ అందిస్తే చాలు.. మీ తోట మల్లె పూల సువాసనతో గుభాళిస్తుంది.

5 / 5
Follow Us
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా

ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..

చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి

ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు

వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు

అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?

హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!

నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా..
నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా..
తల లేకపోయినా బతికేస్తాయి! బొద్దింకల గురించి ఈ ఆసక్తికర విషయాలు