AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్ ఆర్థిక మూలాలపై ట్రంప్ దెబ్బ.. చైనా రిఫైనరీలపై అమెరికా ఆంక్షలు!

ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఇరాన్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం చైనాపై తన పట్టు బిగిస్తోంది. తాజాగా, ఇరాన్ చమురు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న చైనాలోని హెంగ్లీ పెట్రోకెమికల్ రిఫైనరీతో పాటు, సుమారు 40 షిప్పింగ్ కంపెనీలు, నౌకలపై అమెరికా ట్రెజరీ శాఖ కఠినమైన ఆంక్షలు విధించింది.

ఇరాన్ ఆర్థిక మూలాలపై ట్రంప్ దెబ్బ.. చైనా రిఫైనరీలపై అమెరికా ఆంక్షలు!
China Us
Balaraju Goud
|

Updated on: Apr 25, 2026 | 9:24 AM

Share

ఇరాన్ – అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఇరాన్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం చైనాపై తన పట్టు బిగిస్తోంది. తాజాగా, ఇరాన్ చమురు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న చైనాలోని హెంగ్లీ పెట్రోకెమికల్ రిఫైనరీతో పాటు, సుమారు 40 షిప్పింగ్ కంపెనీలు, నౌకలపై అమెరికా ట్రెజరీ శాఖ కఠినమైన ఆంక్షలు విధించింది.

ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఈ చర్యలను సమర్థిస్తూ, ఇరాన్ తన అణు ఆశయాలను నెరవేర్చుకోకుండా, మధ్యప్రాచ్యంలో అస్థిరతను సృష్టించకుండా అడ్డుకోవడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇరాన్ “షాడో ఫ్లీట్” (రహస్య నౌకాదళం) ద్వారా జరుగుతున్న చమురు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం ద్వారా ఆ దేశ ప్రభుత్వానికి అందే నిధులను నిలిపివేయాలని అమెరికా భావిస్తోంది.

చైనాలోని “టీపాట్స్” అని పిలవబడే స్వతంత్ర రిఫైనరీలు ఇరాన్ ముడి చమురుకు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నాయి. వీటిలో హెంగ్లీ పెట్రోకెమికల్ రిఫైనరీ రెండో అతిపెద్దది. ఇరాన్ సైన్యానికి చెందిన కంపెనీల ద్వారా బిలియన్ల డాలర్ల చమురును కొనుగోలు చేయడం ద్వారా ఇరాన్ సాయుధ దళాలకు ఆదాయాన్ని సమకూరుస్తోందని అమెరికా ఆరోపించింది. 19కి పైగా నౌకలు ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీజీ (LPG), పెట్రోకెమికల్ ఉత్పత్తులను సరఫరా చేస్తూ ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తున్నాయి.

ఫిబ్రవరి 2025 నాటికి, ఇరాన్‌తో సంబంధం ఉన్న దాదాపు 1,000 మంది వ్యక్తులు, సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. “ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చిన వారి ఆస్తులు అమెరికాలో స్తంభింపజేస్తాము. అమెరికా పౌరులు లేదా విదేశీ కంపెనీలు వారితో లావాదేవీలు జరిపితే భారీ జరిమానాలు తప్పవు.” అని అమెరికా ట్రెజరీ శాఖ హెచ్చరించింది.

డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపడమే కాకుండా, చైనా-అమెరికా మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉంది. ఇరాన్ ఆదాయ మార్గాలను మూసివేయడం ద్వారా ఆ దేశాన్ని చర్చల దిశగా మళ్లించడం లేదా బలహీనపరచడమే వైట్ హౌస్ వ్యూహంగా కనిపిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us