AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని ఇచ్చిన రూ.10నోటు.. ఖరీదు లక్ష రూపాయలు..రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన దుకాణదారుడు!

సాధారణంగా పది రూపాయల నోటు విలువ అందరికీ తెలిసిందే. కానీ, దేశ ప్రధాని చేతులు మారితే ఆ నోటు విలువ ఆకాశాన్ని తాకుతుందని పశ్చిమ బెంగాల్‌లోని ఒక ఘటన నిరూపించింది. ప్రధాని మోదీ ఒక వ్యాపారికి ఇచ్చిన రూ.10 నోటు కోసం ఇప్పుడు లక్షల రూపాయల బిడ్లు వస్తున్నాయి.

ప్రధాని ఇచ్చిన రూ.10నోటు.. ఖరీదు లక్ష రూపాయలు..రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన దుకాణదారుడు!
West Bengal Jhalmuri Vendor
Jyothi Gadda
|

Updated on: Apr 25, 2026 | 10:15 AM

Share

రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. కానీ, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఒక ఘటన మాత్రం సామాన్యుడి అదృష్టాన్ని, ప్రధాని పట్ల ప్రజలకున్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ప్రధాని మోదీ ఒక వ్యాపారికి చెల్లించిన పది రూపాయల నోటు ఇప్పుడు లక్షాధికారిని చేసే రేంజ్‌కు వెళ్ళింది. సాధారణంగా 10 రూపాయల నోటుతో ఒక టీ లేదా బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది. కానీ, పశ్చిమ బెంగాల్‌లో ఒక 10 రూపాయల నోటు లక్ష రూపాయల విలువైన ఆస్తిగా మారిపోయింది. దీనికి కారణం ఆ నోటు స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రావడమే. పూర్తి వివరాల్లోకి వెళితే…

పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఒక సాధారణ ఝాల్ముడి (మురమురలతో చేసే ప్రత్యేక తినుబండారం)విక్రేతకు ఇచ్చిన 10 రూపాయల నోటు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక సాధారణ కాగితపు నోటు లక్షల విలువైన జ్ఞాపికగా ఎలా మారిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఝార్గ్రామ్ ప్రాంతంలో పర్యటించారు. తన కాన్వాయ్‌లో వెళ్తున్న సమయంలో, ఒక పేద వ్యాపారి అమ్ముతున్న ఝాల్ముడిని చూసి ఆగారు. సామాన్యుడిలా ఆయన ఆ వ్యాపారి దగ్గర 10 రూపాయల ఝాల్ముడి తిని, తన జేబులో నుండి ఒక 10 రూపాయల నోటును తీసి అతనికి ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని అక్కడి నుండి వెళ్లిన కొద్దిసేపటికే ఆ వార్త దావానలంలా వ్యాపించింది. ప్రధాని వాడిన నోటును చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నోట్ల సేకరణ చేసేవారు (Collectors), మోదీ అభిమానులు ఆ నోటును తమకు ఇచ్చేయమని, అందుకు ప్రతిఫలంగా భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారు. ప్రారంభంలో వేలల్లో మొదలైన ఆఫర్, చివరకు లక్ష రూపాయల వరకు చేరింది.

వీడియో ఇక్కడ చూడండి..

తన దగ్గర ఉన్న 10 రూపాయల నోటుకు అంత డిమాండ్ రావడం చూసి ఆ విక్రేత ఆశ్చర్యపోయాడు. తన జీవితంలో ప్రధాని తన దగ్గర ఝాల్ముడి తింటారని ఎప్పుడూ ఊహించలేదు. ఆయన ఇచ్చిన ఈ నోటు తనకు కోట్లు ఇచ్చినా సమానం కాదని అన్నాడు. ఆ నోటును తను ఎవరికీ అమ్మను అని చెప్పాడు.. ఒక జ్ఞాపకంగా తన దగ్గరే భద్రపరుచుకుంటాను అని ఆయన ప్రకటించారు. ఆ నోటును ఫ్రేమ్ చేయించి తన దుకాణంలోనే ఉంచుతానని చెప్పారు.

రాజకీయ రచ్చ ఎలా ఉన్నా, ఒక సాధారణ పౌరుడి పట్ల ప్రధాని చూపిన సామాన్యత్వం, ఆ నోటు పట్ల ప్రజలు చూపిన ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, అది ఒక సామాన్యుడికి దక్కిన అరుదైన గౌరవం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్