అబ్బాయి సినిమాకు బ్రేక్.. బాబాయ్ తో సినిమాకు సై…
దేవర 2 సందిగ్ధతలో ఉండగా, దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నారు. 400 కోట్ల హిట్ తర్వాత కూడా డైలమాలో ఉన్న కొరటాల, బాలయ్యతో ఓల్డ్ స్కూల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య తన ప్రస్తుత సినిమాతో పాటు దీన్ని ప్రారంభించి, తర్వాత దీనిపైనే దృష్టి సారిస్తారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు.
దేవర 2 పరిస్థితి ఏంటి..? సినిమా ఉంటుందా లేదా..? కచ్చితంగా ఉంటుందనే మేకర్స్ చెప్తున్నారు కానీ అనుమానాలు కూడా అలాగే ఉన్నాయి. ఒకవేళ దేవర 2 ఆగిపోతే.. కొరటాల నెక్ట్స్ స్టెప్ ఏంటి..? ఆయన ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు..? కొరటాల లిస్టులో ఉన్న హీరోలెవరు..? ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి..? వీటన్నింటికీ సమాధానం దొరికేసింది. 400 కోట్ల సినిమా ఇచ్చాక కూడా కొరటాలకు కంగారు తప్పట్లేదు. ఆయన నెక్ట్స్ సినిమా ఏంటనేది ఇంకా డైలమాలోనే ఉంది. దేవర 2 ఉందని మేకర్స్ చెప్తున్నా.. అదేమంత ఈజీ కాదు. దేవర 2 సందిగ్ధంలో ఉన్న ఈ టైమ్‌లో ఆయన చూపులు బాలయ్య వైపు వెళ్తున్నాయి. ఈ కాంబినేషన్‌లో సినిమా దాదాపు ఖరారైపోయింది.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఒక్కటే బ్యాలెన్స్. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ అయిపోయాయి. ఓవైపు గోపీచంద్ సినిమా చేస్తూనే.. మరోవైపు కొరటాల సినిమాని కూడా ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు బాలయ్య. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను తరహాలోనే.. బాలయ్యతో మళ్లీ ఓల్డ్ స్కూల్‌కు వెళ్లాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ జూలైలోపే పూర్తి కానుంది.. ఆలోపు కొరటాల ప్రాజెక్ట్ సెట్స్‌పైకి తెచ్చి.. ఆ తర్వాత పూర్తిగా దీనిపైనే ఫోకస్ చేయనున్నారు నటసింహం. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మాత. దేవర 2 కొన్నాళ్లు పక్కనబెట్టి ఇకపై పూర్తి ఫోకస్ బాలయ్య సినిమాపైనే పెట్టబోతున్నారు కొరటాల శివ. మరి ఈ సెన్సేషనల్ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TSRTC: మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె.. చర్చలు షురూ.. ఆ మూడు డిమాండ్లే కీలకం
Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. తగ్గిన బంగారం ధరలు
తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?

