ఎప్పుడైనా ఆలోచించారా? మటన్ లివర్ మన లివర్‌కు మంచిదేనా?

samatha

25 April 2026

నాన్ వెజ్ ఇష్టపడని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా నాన్ వెజ్ తింటారు. ముఖ్యంగా అందులో లివర్ పార్ట్ చాలా మందికి ఇష్టం ఉంటుంది.

నాన్ వెజ్

పొట్టేల్ లేదా మేక, కోడి ఇలా దేని లివర్ అయినా సరే ఇష్టంగా తింటారు, మరి ఇది మన లివర్‌కు మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

పొట్టేల్ లేదా మేక లివర్

లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మేక లివర్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.

లఆరోగ్యానికి మేలు

లివర్ తినడం వలన ఇది రక్తప్రసరణను మెరుగు పరిచి రక్తహీనత సమస్య నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఎర్ర రక్త కణాల తయారీని పెంచుతుంది.

రక్తప్రసరణ మెరుగు

ముఖ్యంగా ఇందులో బీ12 పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా, మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.

మెదడు ఆరోగ్యం

అయితే మేక, కోడి , పొట్టేల్ కాలేయం, మనుషుల కాలేయం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా అంటే నో అనే చెప్పాలి. దీని వలన మనుషుల కాలేయానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవంట.

మనుషుల కాలేయం

మానవ శరీరంలో ఉండే కాలేయం స్వతహాగానే శరీరాన్ని శుద్ధి చేస్తుంది, దీని కోసం జంతువుల కాలేయం పని చేయదంట.

శరీరం శుద్ధి

అంతే కాకుండా ఒక వేళ మేక లేదా పొట్టేల్ కాలేయాన్ని అతిగా తీసుకోవడం వలన ఇందులో ఉండే విటమిన్ ఏ మనుషుల కాలేయంపై ప్రభావం చూపుతుందంట.

మానవ కాలేయంపై ఒత్తిడి