అసలే ఎండా ఉక్కపోత.. పాములు ఇంట్లోకి రాకూడదంటే ఇలా చేయండి!
samatha
24 April 2026
pixels
సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండ , ఉక్కపోతతో ప్రతి ఒక్కరూ అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో పాములు చాలా తిరుగుతుంటాయి.
సమ్మర్
ఎండ వేడిని తట్టుకోలేక అవి తమ నివాసాలను వదిలి చల్లటి ప్రాంతాలకు వెళ్తుంటాయి. ముఖ్యంగా జనావాసాల్లోకి వస్తుంటాయి. అందుకే సమ్మర్‌లో పాముల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటారు.
ఎండ వేడి, ఉక్కపోత
కాగా, ఎండాకాలంలో పాముల నుంచి రక్షణ పొందడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. దీని వలన పాములను ఇంటిలోకి రాకుండా నివారించుకోవచ్చును.
చిట్కాలు
ఇంటి పరిసరాల్లో పాములు చల్లదనం కోసం వచ్చి పొదల్లో దాక్కుంటాయి. కాబట్టి ఇంటి చుట్టూ చెత్తా చెదారం లేకుండా చేసుకోవాలి.
పొదలు
చాలా మంది చల్లదనం కోసం కిటికీలు తెరిచి ఉంచుతారు. అయితే వేడి కారణంగా చల్లదనం కోసం పాములు కిటికీలో నుంచి ఇంటిలోకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
కిటికీలు
పడుకునే ముందు మీ దిండు, దుప్పటి, మంచం అడుగు భాగాన్ని ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. లేకపోతే వాటి కింద పాములు ఉండే ఛాన్స్ ఉంది.
దిండు, దుప్పటి
అయితే ఇంటికి పాములు రాకూడదు అంటే వాటికి వెల్లుల్లి నీటి వాసన అస్సలే నచ్చదు. అందువలన వెల్లుల్లి రసం ఇంటి చుట్టూ చల్లాలి దీని వలన పాములు ఇంటిలోకి రావు.
వెల్లుల్లి వాటర్ స్ప్రే
అదే విధంగా, నిమ్మరసం, ఉప్పు నీటిని కలిపి ఇంటి చుట్టూ చల్లడం వలన కూడా పాములు ఇంటిలోకి రాకుండా ఉంటాయి. ఈ జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.