TG KGBV Inter Admissions 2026: తెలంగాణ కేజీబీవీల్లో ఇంటర్ ఇంగ్లిష్ మీడియం అడ్మిషన్లకు నోటిఫికేషన్.. ఎవరు అర్హులంటే?
TG KGBV Inter Admissions 2026 Notification: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో (KGBV) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్దులకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో (KGBV) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్దులకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం MPC, BPC, CEC గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణలో మొత్తం 93 KGBV విద్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరిని TGRJC CET-2026 ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 15, 2026వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి తెలిపారు. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌లోని వివరణాత్మక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. లేదంటే 040-24734899, 18004252428 ఫోన్ నంబర్లను పని దినాల్లో ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని వివరించారు.
తెలంగాణ కేజీబీవీల్లో ఇంటర్ ఇంగ్లిష్ మీడియం అడ్మిషన్ల దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




