Edible Oil Price: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న వంట నూనె ధరలు.. కారణం ఇదే

Edible oil price in India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాటినుంచి వంట నూనె ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు రెండు నెలల నుంచి దాదాపు లీటర్ వంట నూనెపై రూ.75 మేర పెరిగాయి.

Edible Oil Price: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న వంట నూనె ధరలు.. కారణం ఇదే
Edible Oil Prices
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 24, 2022 | 7:28 AM

Edible Oil Price in India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాటినుంచి వంట నూనె ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు రెండు నెలల నుంచి దాదాపు లీటర్ వంట నూనెపై రూ.75 మేర పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలపై మరో భారం పడనుంది. ఏప్రిల్‌ 28 తర్వాత, వంటనూనె మరింత ప్రియం కానున్నట్లు (Cooking Oil) మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్‌లో వంటనూనె ధరలు ఇప్పటికే భగ్గుమంటున్నాయి.. త్వరలో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లీటర్‌ సోయా నూనె 250, సన్‌ఫ్లవర్‌ నూనె 300, పామాయిల్‌ 200 దాటే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. దీనికి కారణాలు లేకపోలేదు. తాజాగా ఇండోనేసియా (Indonesia) కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనె ఎగుమతులపై నిషేధం విధించింది. ఏప్రిల్ 28 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. దీంతో మన దేశంలో వంట నూనె ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అటు ఇప్పటికే అమెరికాపై ఇండోనేషియా నిషేధం ఎఫెక్ట్‌ పడింది. అమెరికా (America) లో సోయా నూనె ధర 84 డాలర్లకు చేరింది. నెమ్మదిగా అది భారత్‌పై కూడా పడుతుందనే ఆందోళన నెలకొంది.

కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికే సన్ ఫ్లవర్ ఆయిల్ సరఫరాపై ప్రభావం పడింది. ఉక్రెయిన్ యుద్ధం ఇందుకు కారణమైంది. ఇప్పుడు పామ్ ఆయిల్ సరఫరాపై కూడా ఎఫెక్ట్ పడబోతోంది. దీంతో దేశంలో వంట నూనె ధరలు భారీగా పెరనున్నాయి. ఇప్పటికే వంట నూనె ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు ఇండోనేసియా నిర్ణయం వల్ల ధరలు మరింత పెరగితే, సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

కేంద్ర ప్రభుత్వం ఇండోనేసియాతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని కోరుతున్నారు. మళ్లీ ఎగమతులు ప్రారంభం అయ్యేలా చూడాలని సూచిస్తున్నారు నిపుణులు. దేశీయ మార్కెట్‌లో ధరలు పెరగడం, పామ్ ఆయిల్ సరఫరా కొరత వంటి అంశాల కారణంగానే, ఇండోనేసియా ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read:

Russia Ukraine War: నల్ల సముద్రంలో మునిగిన మాస్క్‌వా ఘటనపై రష్యా కీలక ప్రకటన.. ఎంతమంది చనిపోయారంటే?

Nigeria explosion: ఘోర ప్రమాదం.. ఫ్యాక్టరీలో పేలుడు.. 100 మందికి పైగా సజీవ దహనం!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే