Russia Ukraine War: నల్ల సముద్రంలో మునిగిన మాస్క్‌వా ఘటనపై రష్యా కీలక ప్రకటన.. ఎంతమంది చనిపోయారంటే?

రష్యాలో మాస్క్‌వా ఘటన కలకలం రేపుతుంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 27 మంది గల్లంతైనట్లు ప్రకటించింది రష్యా ప్రభుత్వం.

Russia Ukraine War: నల్ల సముద్రంలో మునిగిన మాస్క్‌వా ఘటనపై రష్యా కీలక ప్రకటన.. ఎంతమంది చనిపోయారంటే?
Russian Moskva
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 24, 2022 | 7:18 AM

Russia Moskva: రష్యాలో మాస్క్‌వా ఘటన కలకలం రేపుతుంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 27 మంది గల్లంతైనట్లు ప్రకటించింది రష్యా ప్రభుత్వం. రష్యాకు చెందిన ప్రధాన యుద్ధ నౌకల్లో ఒకటైన మాస్క్‌వా నల్ల సముద్రంలో నీట మునిగింది. ఘటనలో ఓ సెయిలర్‌ మరణించగా, 27 మంది గల్లంతైనట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 13న ఉక్రెయిన్‌ సముద్రంలో జరిగిన భారీ పెలుడుతోని.. సముద్రంలో మునిగిపోయినట్లు రష్యా వెల్లడించింది. దీంతో ఓ సర్విస్‌మ్యాన్‌ మరణించాడని, 27 మంది సిబ్బంది ఆచూకీ లభించలేదని తెలిపింది రష్యా. మరో 396 మందిని క్షేమంగా ఒడ్డుకు తరలించామని పేర్కొంది. 1

6 దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యమున్న మాస్క్‌వా.. 186 మీటర్లు పొడవు ఉంటుంది. 62 మంది అధికారులతో పాటు 476 మంది సిబ్బంది అందులో పనిచేస్తారు. సుమారు 40 ఏండ్ల పాటు సేవలందించిన ఈ రష్యా యుద్ధ నౌక మాస్క్‌వా ఈ నెల 15న ధ్వంసమై నల్ల సముద్రంలో మునిగిపోయింది. నాటి సోవియట్ రిపబ్లిక్‌లో భాగమైన ఉక్రెయిన్‌ మైకోలైవ్‌లోని షిప్‌యార్డ్‌లో మాస్క్‌వా యుద్ధనౌక తయారైంది. మొదట్లో దానిని స్లావాగా అని పిలిచేవారు. అది 1979 జూలైలో జలప్రవేశం చేసింది. సోవిట్‌ విచ్ఛిన్నమైన.. రష్యా ఆవిర్భవించిన తర్వాత రాజధాని మాస్కో పేరును సూచించేలా మాస్క్‌వాగా దీనికి పేరుపెట్టారు. అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో మాస్క్ వా కీలకంగా వ్యవహరించింది. జార్జియా, సిరియా, ఉక్రెయిన్‌ సంఘర్షణలోను సేవలందించినట్లు మస్క్ వా హిస్టరీ చెబుతుంది.

Read Also…  Nigeria explosion: ఘోర ప్రమాదం.. ఫ్యాక్టరీలో పేలుడు.. 100 మందికి పైగా సజీవ దహనం!