AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Sign: ఈ రాశి అమ్మాయిలను వివాహం చేసుకున్నవారు అదృష్టాన్ని సొంతం చేసుకున్నట్లే.. అభివృద్ధిని సాధిస్తారు…

Zodiac Sign: పెళ్లికి పుట్టిన తేదీ, సమయం, స్థలానికి మధ్య రిలేషన్(Relationship) ఉంటుందని సనాతన ధర్మంలో ఓ నమ్మకం. వైవాహిక జీవితం ఆనందంగా సాగడానికి.. రాశిఫలాలు(Rashiphalalu) ముఖ్యమని..

Zodiac Sign: ఈ రాశి అమ్మాయిలను వివాహం చేసుకున్నవారు అదృష్టాన్ని సొంతం చేసుకున్నట్లే.. అభివృద్ధిని సాధిస్తారు...
Surya Kala
|

Updated on: Apr 24, 2022 | 11:07 AM

Share

Zodiac Sign: పెళ్లికి పుట్టిన తేదీ, సమయం, స్థలానికి మధ్య రిలేషన్(Relationship) ఉంటుందని సనాతన ధర్మంలో ఓ నమ్మకం.  వైవాహిక జీవితం ఆనందంగా సాగడానికి.. రాశిఫలాలు(Rashiphalalu) ముఖ్యమని అంటారు. వేద జ్యోతిషశాస్త్రంలో, రాశిచక్రం ఆధారంగా ఆ వ్యక్తి  స్వభావం, భవిష్యత్తు, ప్రవర్తన గురించి తెలుసుకుంటారు. ప్రజలు జ్యోతిష్యశాస్త్రాన్ని విశ్వసిస్తారు. ఒక్కో రాశిలోని వ్యక్తుల ఇష్టాయిష్టాల వేరు వేరుగా ఉంటాయి. కొన్ని రాశులవారు చాలా అదృష్టవంతులు.. వీరు ఇతరుల భవిష్యత్తును మారుస్తారు. అలాంటి రాశుల్లో మూడు రాశులకు చెందిన అమ్మాయిలును పొందిన భర్త చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ రాశికి చెందిన అమ్మాయిలతో సంబంధం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది.  వివాహం తర్వాత అబ్బాయిల భవిష్యత్ మారుతుంది. అభివృద్ధి పథంలో పయనిస్తారు. ఆ మూడు రాశుల అమ్మాయిల గురించి తెలుసుకుందాం..

వృషభ రాశి: జ్యోతిషశాస్త్రం ప్రకారం, వృషభ రాశికి చెందిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా పరిగణించబడతారు. ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు తమ జీవితంలోని అన్ని కలలను నెరవేర్చుకుంటారు. తమ కృషి, నిజాయితీ, తెలివితేటలతో మంచి భవిష్యత్ ను మంచిగా మలచుకుంటారు. వృషభరాశి అమ్మాయిలు భర్తకు బలమైన మద్దతునిస్తారు. ఈ అమ్మాయిలు  భర్త లక్ష్యాన్ని నెరవేర్చడంలో సహాయం చేస్తారు. ఈ రాశి అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఏ అబ్బాయి అదృష్టమైనా మారుతుంది.

కన్య రాశి:  కన్యారాశి అమ్మాయిలు స్వతహాగా చాలా తెలివైనవారు, సహనం కలిగి ఉంటారు. అంతేకాదు కాదు ఈరాశిలో జన్మించిన  అమ్మాయిలు మర్యాదపూర్వక స్వభావం కలిగి ఉంటారు. అందరి పట్ల శ్రద్ధ వహిస్తారు. ఈ రాశి వారు అడుగడుగునా భర్తను అనుసరిస్తారు. ఆమె తన భర్తతో కలిసి అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తారు. వివాహం అనంతరం భర్త  విజయంలో  ముఖ్యమైన పాత్ర పోశిస్తుంది ఈ రాశిలో జన్మించిన అమ్మాయి.

మకర రాశి:  జ్యోతిష్య శాస్త్రంలో మకర రాశి అమ్మాయిలకు ప్రత్యేకం స్థానం ఉంది. ఈ రాశి అమ్మాయిలపై శని ప్రభావం ఉంటుంది. ఈ అమ్మాయిలు కష్టపడి పనిచేసేవారు. అందరి మక్కువను పొందుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉంటారు. సమస్యను ఎప్పుడూ దృఢంగా ఎదుర్కొంటుంది. మకరరాశి అమ్మాయిలు అడుగడుగునా భర్తను అనుసరిస్తూ భర్తను జీవితంలోని కష్టాల నుండి దూరం చేయడానికి కృషి చేస్తారు. జీవితంలో భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తారు.. భర్తకు విజయాన్ని అందించడంలో అండగా నిలబడతారు.

(Note : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: Animals Bath: రాజభోగమంటే ఇదేనేమో.. ద్వారకా తిరుమలలో అశ్వాలు, గజరాజులకు షవర్ బాత్

Mutton Biryani: ఆ దేవాలయంలో స్వామివారికి మటన్ బిర్యానీ నైవేద్యం.. భక్తులకు అదే ప్రసాదం.. ఎక్కడో తెలుసా..