AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton Biryani: ఆ దేవాలయంలో స్వామివారికి మటన్ బిర్యానీ నైవేద్యం.. భక్తులకు అదే ప్రసాదం.. ఎక్కడో తెలుసా..

Mutton Biryani: హిందువులు(Hindus) మాంసాహారులు (Non-vegetarian), శాఖాహారులుగా(vegetarian) ఉన్నప్పటికీ.. ఎక్కువమంది శాఖాహారాన్ని మాత్రమే తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా పండగలు..

Mutton Biryani: ఆ దేవాలయంలో స్వామివారికి మటన్ బిర్యానీ నైవేద్యం.. భక్తులకు అదే ప్రసాదం.. ఎక్కడో తెలుసా..
Mutton Biryani As Prasad In
Surya Kala
|

Updated on: Apr 24, 2022 | 10:18 AM

Share

Mutton Biryani: హిందువులు(Hindus) మాంసాహారులు (Non-vegetarian), శాఖాహారులుగా(vegetarian) ఉన్నప్పటికీ.. ఎక్కువమంది శాఖాహారాన్ని మాత్రమే తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా పండగలు, ఫంక్షన్లు వంటి విశేషమైన రోజుల్లో పూర్తిగా శాఖాహార పదార్ధాలను మాత్రమే ఉపయోగిస్తారు. అంతేకాదు ప్రతి హిందూ దేవాలయాల్లో పులిహోర, దద్దోజనం, పండ్లు వంటి పదార్ధాలను నైవేద్యంగా పెడతారు. అయితే కొన్ని దేవాలయాల్లో నియమాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. మాంసాహారం, మందు వంటి పదార్దాలను నైవేద్యంగా స్వామివారికి పెడతారు. అలాంటి దేవాలయం ఒకటి తమిళనాడులో ఉంది. ఈ ఆలయంలో స్వామివారికి ప్రసాదంగా మటన్‌ బిర్యానీ పెడతారు. దేవుడికి నైవేద్యం పెట్టిన ఆ ప్రసాదాన్ని తిరిగి భక్తులకు ప్రసాదంగా పంచుతారు.  వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు మధురై జిల్లాలోని తిరుమంగళం సమీపంలో వడుకంపట్టి గ్రామంలో మునీశ్వరుడి ఆలయం. ఆ ఆలయంలో భాస్మతీ రైస్‌ తో చేసిన మటన్‌  బిర్యానీ చేసి స్వామివారికి నైవేద్యంగా నివేదిస్తారు. అనంతరం ఈ మటన్ బిర్యానీని ప్రసాదంగా భక్తులకు కోరినంత పెడతారు. ఈ గుడిలో ఈ వింత ఆచారానికి ఒక ఆసక్తి కథనం కూడా ఉంది.

మునీశ్వరుడి గుడిలో బిర్యానీ ప్రసాదం:

85 ఏళ్ల క్రితం సుబ్బనాయుడు అనే వ్యక్తి మునీశ్వర పేరుతో హోటల్‌ను ప్రారంభించాడు. ఆ హోటల్‌లో బిర్యానీ అమ్మేవాడు. హోటల్ లో బిర్యానీ అమ్ముతూ డబ్బుకి డబ్బు పేరుకి పేరు సంపాదించుకున్నాడు సుబ్బనాయుడు. తన హోటల్ బిజినెస్ సక్సెస్ కావడానికి కారణం.. మునీశ్వరుడు కారణం అని అతను నమ్మాడు. దీంతో ప్రతి ఏడాది స్వామివారికి బిర్యానీని నైవేద్యంగా పెట్టడం ప్రారంభించాడు. అనంతరం ఈ ప్రాంతంలో ఇతర వ్యాపారస్తులు కూడా హోటల్ బిజినెస్ మొదలు పెట్టడం.. వారు కూడా సక్సెస్ కావడం జరిగింది. దీంతో అక్కడ బిర్యానీకి మంచి పేరు వచ్చింది. దీంతో మునీశ్వరుడికి  బిర్యానీ ప్రసాదంగా పెట్టడం ఆచారంగా మారింది. అయితే ఇలా హిందూ దేవాలయంలో మటన్ బిర్యానీని ప్రసాదంగా పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది తప్పు అంటే.. దేవుడికి మాంసాహారం, శాఖాహారం అనే తేడాలు లేవంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read:Rajasthan: రాజస్థాన్‌లో అమానుషం.. దళిత వధూవరులను ఆలయంలోకి రానీయకుండా అడ్డుకున్న పూజారి!

Bahubali Monkey: కండలు చూపిస్తూ వింతగా నడుస్తున్న కోతి ఈ బాహుబలి ముందు ప్రభాస్‌ కూడా చిన్నబోవాల్సిందే..!

Miracle Gardens: 45లక్షల రకాల పూవ్వులను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ప్రపంచంలోనే అతి పెద్ద పూదోట ఎక్కడుందో తెలుసా..