Pranahita Pushkaralu: నేటితో ముగియనున్న ప్రాణహిత పురష్కారాలు.. భక్త సంద్రంగా మారిన పుష్కర ఘాట్లు..
Pranahita Pushkaralu: గోదావరి నది(Godavari River) ముఖ్య ఉపనది ప్రాణహిత పురష్కారాలు తుది అంకానికి చేరుకున్నాయి. ప్రాణహిత పుష్కరాలు(Purashkaralu) నేటితో ముగియనుండటంతో..
Pranahita Pushkaralu: గోదావరి నది(Godavari River) ముఖ్య ఉపనది ప్రాణహిత పురష్కారాలు తుది అంకానికి చేరుకున్నాయి. ప్రాణహిత పుష్కరాలు(Purashkaralu) నేటితో ముగియనుండటంతో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నేడు 12వ రోజు.. చివరి రోజు కావడంతో మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట, మహారాష్ట్రలోని నగరం, సిరోంచ, త్రివేణి సంగమ పుష్కర ఘాట్లు భక్త సంద్రంగా మారాయి. కాళేశ్వరంలోని త్రివేణి సంగమ తీరం భక్త జనంతో నిండిపోయింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరించడానికి బారులు తీరారు. కాళేశ్వరం, నగరం, సిరోంచలోని పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు సంప్రదాయ రీతిలో నదిలో మునకలు వేస్తూ.. నదీమతల్లికి భక్తితో పూజలను నిర్వహిస్తున్నారు. పితృ దేవతల స్మరణ పూర్వక శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తున్నారు.
బారులు తీరిన భక్తులు:
త్రివేణీ సంఘ ప్రాంతంలో స్నానం చేసిన చేసిన భక్తులు కాళేశ్వరంలో ముక్తీశ్వర స్వామి దర్శనానికి బారులు తీరారు. కాళేశ్వర క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగుతుంది. క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.
నేడు పూర్ణాహుతి:
కాళేశ్వరంలో స్థానిక జీఎంఆర్ పటేల్ అతిథిగృహం ఆవరణలో పుష్కర మహాయాగం నిర్వహిస్తున్నారు. నేటితో పుష్కరాల ముగియనుండడంగా పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఆలయంలోని ఉత్సవమూర్తులకు త్రివేణి సంగమ తీరంలో స్నానం, సంప్రోక్షణ నిర్వహించనునున్నారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి:
పడణవీస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రణీత పుష్కరాల సందర్భంగా ఆయన మహారాష్ట్ర లోని సిరోంచ పుష్కర ఘాట్ వద్ద నది మాతకు విశేష పూజలు చేశారు. ప్రణీత నదికి ఆర్గ్య ప్రదానం చేసి, పొక్షణ చేసుకున్నారు. అక్కడి నుంచి కాళేశ్వర ఆలయం రాజగోపురం వద్దకు చేరుకోగా అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకం చేసి అమ్మవారికి మొక్కలు చెల్లించారు. ఈ సందర్భంగా మీడియా తో ఆయన మాట్లాడుతూ కాళేశ్వర క్షేత్రం ప్రాశస్త్యం చాలా గొప్పదనిన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని పూజలు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read:AP News: ఈ దొంగల రూటే సపరేటు.. వాళ్లే అమ్ముతారు, మళ్లీ వాళ్లే ఎత్తుకుపోతారు..