AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Women University: తెలంగాణలో మహిళా విశ్వ విద్యాలయం.. జీవో జారీ చేసిన సర్కార్..

Telangana Women University: మహిళల అభ్యున్నతి, ప్రొటెక్షన్ కోసం ఎన్నో చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Women University: తెలంగాణలో మహిళా విశ్వ విద్యాలయం.. జీవో జారీ చేసిన సర్కార్..
Koti Women University
Shiva Prajapati
|

Updated on: Apr 25, 2022 | 7:29 PM

Share

Telangana Women University: మహిళల అభ్యున్నతి, ప్రొటెక్షన్ కోసం ఎన్నో చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు అధికారిక జీవో జారీ చేసింది. తెలంగాణలో ఇదే మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ కావడం విశేషం. తెలంగాణలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడంపట్ల మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తుంది. కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా మారుస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన మేరకు కోటీ ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వ విద్యాలయంగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంటక రమణ, ఓయూ వీసీ రవీందర్‌కు అందించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Also read:

Puzzle Picture: ఫసక్.. ఇంత సింపుల్‌ ఫజిల్‌ను కూడా ఛేజ్ చేయలేకపోతున్నారు.. మీవల్ల అయితే ట్రై చేయండి..!

Shah Rukh Khan: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ‘షారుఖ్ ఖాన్’ ఇల్లు.. ఎందుకో తెలుసా?..

TS Police Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పోలీసు నియామకాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..