KTPP fire accident: కేటీపీపీలో అగ్నిప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం..

KTPP fire accident: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చేల్పూరు కేటీపీపీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి.

KTPP fire accident: కేటీపీపీలో అగ్నిప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం..
Ktpp
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 25, 2022 | 10:05 PM

KTPP fire accident: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చేల్పూరు కేటీపీపీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కేటీపీపీలోని మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్‌లోని రిజెక్ట్ కోల్ మిల్‌లో వర్క్స్ నడుస్తున్నాయి. సోమవారం సాయంత్రం విధులు నిర్వహిస్తున్న కార్మికులు మిల్ లోని డోర్ తిప్పే క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలాన్ని చేరుకుని మంటలు ఆర్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జూనియర్ ప్లాంట్ అటెండెంట్‌తో పాటు మరో ఇద్దరరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

Also read:

Post Office scheme: అదరిపోయే స్కీమ్.. రూ. 50 వేలు డిపాజిట్ చేసి రూ. 3,300 ఆదాయం పొందొచ్చు.. అదెలాగంటే..

Telangana Women University: తెలంగాణలో మహిళా విశ్వ విద్యాలయం.. జీవో జారీ చేసిన సర్కార్..

Puzzle Picture: ఫసక్.. ఇంత సింపుల్‌ ఫజిల్‌ను కూడా ఛేజ్ చేయలేకపోతున్నారు.. మీవల్ల అయితే ట్రై చేయండి..!