Mango Price: ‘మామిడి’ డిమాండ్ మామూలుగా లేదుగా.. ధర తెలిస్తే వాటిజోలికెళ్లరు..! లక్షలో..
మామిడి రికార్డు ధర పలుకుతోంది. ఈ యేడాది టన్ను 70వేల నుండి లక్ష రూపాయలు పలుకుతోంది. సప్లయ్ తగ్గడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సామాన్యులు మామిడి టేస్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.
మామిడి రికార్డు ధర పలుకుతోంది. ఈ యేడాది టన్ను 70వేల నుండి లక్ష రూపాయలు పలుకుతోంది. సప్లయ్ తగ్గడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సామాన్యులు మామిడి టేస్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. వరంగల్ లక్ష్మీపురం పండ్ల మార్కెట్ మామిడికి ఫేమస్. ఇక్కడి నుండి పంజాబ్, హర్యానా, యూపీ, జమ్మూకశ్మీతోపాటు నేపాల్‌కు మ్యాంగో ఎగుమతి చేస్తారు. మామిడి పళ్లలో బంగినపల్లి రకం ఎంతో రుచిగా ఉంటుంది. ఈ యేడాది బంగినపల్లి మామిడి టన్నుకు లక్ష రూపాయలు పలుకుతోంది. గతేడాది ఇదే సమయానికి మార్కెట్‌కు 1,581 టన్నుల మామిడి విక్రయానికి వచ్చింది. కానీ.. ఈ యేడాది ఇప్పటివరకూ కేవలం 56 టన్నులు మాత్రమే మార్కెట్‌కు వచ్చాయి. ఎకరా మామిడి తోటవేస్తే 12 నుండి 15 టన్నుల దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈ యేడాది రెండు, మూడు టన్నుల కన్నా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు అంటున్నారు.గతేడాది దిగుబడి ఉన్నప్పటికీ టన్ను మామిడి 15 వేల నుండి 35 వేల వరకు పలికింది. ఈ యేడాది వర్షాలు చీడపీడలతో మామిడితోటలు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా మామిడికాయ ఊహించినస్థాయిలో రావడం లేదు. దాంతో టన్ను మామిడి ఎన్నడూలేని విధంగా 70వేల నుండి లక్ష రూపాయలు పలుకుతోంది. ప్రస్తుత ధరలు చూస్తే సంతోషంగా ఉన్నప్పటికీ దిగుబడి లేక పెట్టుబడి రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ఏప్రిల్ రెండోవారంలో కూడా మామిడి మార్కెట్‌కు పెద్దమొత్తంలో తరలిరావడం లేదని వ్యాపారులు తెలిపారు. ఇక రైతులు మార్కెట్‌కు వచ్చే ముందు కాయ సైజు చూసుకొని తీసుకొస్తే మరింత ధర లభించే అవకాశం ఉంటుందని ఏనుమాముల మార్కెట్ సిబ్బంది చెబుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

