Elon Musk: ట్విట్టర్ కొనుగోలు విషయంలో పంతం నెగ్గించుకుంటున్న ఎలాన్ మస్క్..! డీల్ వివరాలు..
Twitter Sale: ట్విట్టర్ బోర్డు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇచ్చిన కొనుగోలు ఆఫర్ ను త్వరలోనే అంగీకరించే యోచనలో ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Twitter Sale: ట్విట్టర్ బోర్డు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇచ్చిన కొనుగోలు ఆఫర్ ను త్వరలోనే అంగీకరించే యోచనలో ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. మైక్రో బ్లాగింగ్ సైట్ కొనుగోలుకు మస్క్ ఇచ్చిన బెస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్(Best and final offer) అయిన 43 బిలియన్ డాలర్ల క్యాష్ డీల్ కు త్వరలోనే పచ్చజెండా ఊపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ పై ట్విట్టర్ సంస్థ రాత్రిలోపు ఒక అధికారిక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ట్విట్టర్ షేర్‌హోల్డర్‌లకు(Share Holders) లావాదేవీ విషయమై సంప్రదించిన తరువాత బోర్డు ప్రకటన వెలువడనుంది. డీల్‌ను ముగించడానికి కాలపరిమితి నిర్ణయించడంతో పాటు అగ్రిమెంట్ వైలేట్ చేస్తే చెల్లించాల్సిన రుసుములను నిర్ణయించడం ప్రాథమిక ఆందోళనల్లో ఒకటిగా తెలుస్తోంది. ఈ డీల్ విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన, రెగ్యులేటరీ నిబంధనల గురించి కంపెనీ పరిశీలిస్తోంది.
యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌తో మస్క్‌కి ఉన్న బలమైన సంబంధాలు ఉన్నాయి. మస్క్‌కి వ్యతిరేకంగా ఏవైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా అనే అంశాలను ట్విట్టర్ పరిశీలిస్తోంది. ఎందుకంటే అలాంటి వాటి వల్ల డీల్ ప్రమాదంలో పడవచ్చు.
ట్విటర్ బోర్డు సభ్యులలో బ్రెట్ టేలర్ (సహ-CEO), పరాగ్ అగర్వాల్ (CEO), మిమీ అలెమేహౌ (మాస్టర్ కార్డ్‌లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ కోసం సీనియర్ వైస్ ప్రెసిడెంట్), జాక్ డోర్సే (CEO మరియు కో-ఫౌండర్, స్క్వేర్), ఎగాన్ డర్బన్ (సహ- CEO, సిల్వర్ లేక్), మార్తా లేన్ ఫాక్స్ (ఫౌండర్ మరియు ఛైర్‌పర్సన్, లక్కీ వాయిస్ గ్రూప్), ఒమిడ్ కోర్డెస్తానీ (మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ట్విట్టర్), డాక్టర్ ఫీ-ఫీ లి (స్టాన్‌ఫోర్డ్‌లో ప్రొఫెసర్), పాట్రిక్ పిచెట్ (జనరల్ పార్టనర్, ఇనోవియా క్యాపిటల్), డేవిడ్ రోసెన్‌బ్లాట్ (CEO, 1stdibs.com, Inc), రాబర్ట్ జోల్లిక్ (అలయన్స్ బెర్న్‌స్టెయిన్ హోల్డింగ్ L.P. డైరెక్టర్ల బోర్డు మాజీ ఛైర్మన్) ఉన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Stock Market: వారం ఆరంభంలోనూ మార్కెట్లను వెంటాడిన నష్టాలు.. 17000 మార్క్ కిందకు నిఫ్టీ..