Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gowtham Adani: ప్రపంచ టాప్-5 కుబేరుల్లో గౌతమ్ అదానీ.. వారెన్ బఫెట్ ను వెనక్కు నెట్టిన భారత వ్యాపారవేత్త..

Gowtham Adani: భారత్ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్‌(Adani Group) ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ కొత్త శిఖరాన్ని చేరుకున్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల తాజా జాబితా ప్రకారం అదానీ ఇప్పుడు ప్రపంచంలో టాప్-5 కుభేరుల్లో ఒకరుగా నిలిచారు.

Gowtham Adani: ప్రపంచ టాప్-5 కుబేరుల్లో గౌతమ్ అదానీ.. వారెన్ బఫెట్ ను వెనక్కు నెట్టిన భారత వ్యాపారవేత్త..
Adani
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 25, 2022 | 6:21 PM

Gowtham Adani: భారత్ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్‌(Adani Group) ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ కొత్త శిఖరాన్ని చేరుకున్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల తాజా జాబితా ప్రకారం అదానీ ఇప్పుడు ప్రపంచంలో 5వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అదానీ ఆస్తుల నికర విలువ 123.2 బిలియన్ డాలర్లుగా ఉంది. దీని వల్ల ఆయన అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌(Warren Buffet) స్థానాన్ని ఆక్రమించారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచ సంపన్నుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్ అంబానీ 8వ స్థానంలో నిలిచారు. ఈ విధంగా చూస్తే ప్రపంచంలోని టాప్- 10 ధనవంతుల్లో ఇద్దరు భారతీయులు నిలవటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అతని మొత్తం నికర విలువ 269.70 బిలియన్ డాలర్లుగా ఉంది. జెఫ్ బెజోస్ 170.2 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ అతని కుటుంబం నికర విలువ 166.8 బిలియన్ డాలర్లుగా ఉండటంతో ఆయన మూడవ స్థానంలో నిలిచారు.

ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులు వీరే..

1. ఎలాన్ మస్క్ 269.7 బిలియన్ డాలర్లు

2. జెఫ్ బెజోస్ 170.2 బిలియన్ డాలర్లు

3. బెర్నార్డ్ ఆర్నాల్ట్ 166.8 బిలియన్ డాలర్లు

4. బిల్ గేట్స్ 130.2 బిలియన్ డాలర్లు

5. గౌతమ్ అదానీ 123.2 బిలియన్ డాలర్లు

6. వారెన్ బఫెట్ 121.7 బిలియన్ డాలర్లు

7. లారీ ఎల్లిసన్ 107.6 బిలియన్ డాలర్లు

8. ముఖేష్ అంబానీ 103.7 బిలియన్ డాలర్లు

9. లారీ పేజీ 102.4 బిలియన్ డాలర్లు

10. సెర్గీ బ్రిన్ 98.5 బిలియన్ డాలర్లు

ఇదే సమయంలో అదానీ పవర్ మార్కెట్ క్యాప్ రూ. 1 లక్ష కోట్లను దాటింది. దీంతో లక్ష కోట్లు దాటిన ఆరవ కంపెనీగా అదానీ గ్రూప్ లో నిలిచింది. ఈరోజు ట్రేడింగ్‌లో ఈ షేరు రూ.270.80 వద్ద ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు.. ఈ స్టాక్ 165% కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేసింది. కేవలం ఈ నెలలో అదానీ పవర్ స్టాక్ 46% పెరిగింది. దీనికి ముందు.. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని సాధించాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Temperature: 122 ఏళ్లలో ఎన్నడూ చూడని ఎండలు.. ఇంత వేడి ఎందుకంటే..

Anand Mahindra: ఒరిజినల్ టెస్లా కార్ ఇదేనంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఎలాన్ మస్క్ ను ట్విట్టర్‌లో ట్యాగ్