Elon Musk Buy Twitter: ఎలన్‌ మస్క్‌ చేతిలోకి ట్విట్టర్‌ పిట్ట.. సీఈఓ పరాగ్‌కు చెక్ పడినట్టేనా..

బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ అనుకున్నది సాధించారు. ఎట్టకేలకు ట్విట్టర్‌ను కైవసం చేసుకున్నారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని 10 రోజుల క్రితం ప్రకటించిన మస్క్‌..

Elon Musk Buy Twitter: ఎలన్‌ మస్క్‌ చేతిలోకి ట్విట్టర్‌ పిట్ట.. సీఈఓ పరాగ్‌కు చెక్ పడినట్టేనా..
Elon Musk
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 26, 2022 | 8:48 AM

బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌(Elon Musk ) అనుకున్నది సాధించారు. ఎట్టకేలకు ట్విట్టర్‌ను (Twitter)కైవసం చేసుకున్నారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని 10 రోజుల క్రితం ప్రకటించిన మస్క్‌..ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. మస్క్‌ ఇచ్చిన భారీ ఆఫర్‌కు ట్విట్టర్‌ బోర్డ్‌ ఆమోదం తెలిపింది. ఒక్కో షేరుకు 54రూపాయల 20పైసల ధరతో వాటాల్ని సొంతం చేసుకునేలా డీల్‌ ఒకే అయింది. మొత్తం 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను ఆయన కొనుగోలు చేయనున్నారు. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌లో 15వ స్థానంలో ఉన్న ట్విట్టర్‌ని చేజిక్కించుకున్నారు ఎలన్‌మస్క్‌. 16 ఏళ్లుగా ప్రపంచంలోని ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసే ఓ వేదికగా మారింది ట్విట్టర్‌. ఆన్‌లైన్‌లో తమ తమ అభిప్రాయాలు, సూచనలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేందుకు జనం ట్విట్టర్‌ను ఒక వేదికగా మార్చుకున్నారు.

అయితే దీన్ని ఏ కంపెనీ అయినా కొనుగోలు చేయాలంటే సాధారణంగా ఒక ఏడాది పాటు చర్చ జరుగుతుంది. కానీ ఇంత పెద్ద డీల్‌ విషయంలో చాలా ప్లాన్డ్‌గా వ్యవహరించాడు మస్క్‌. అసలు ట్విట్టర్‌ పనైపోయిందని ట్వీట్‌ చేసి, ఏకంగా దాన్ని కొనుగోలు చేసే వరకు వ్యవహారాన్ని నడిపారు. కేవలం నెల రోజుల్లో అతిపెద్ద డీల్‌ని క్లోజ్‌ చేశాడు. దీంతో ఎలన్‌ మస్క్‌ ఎత్తుగడపై ఇప్పుడు బిజినెస్‌ టైకూన్‌లే ఆశ్చర్యపోతున్నారు. ఏప్రిల్‌ 9 నుంచి మొదలైన మైండ్‌ గేమ్‌ ఏప్రిల్‌ 25తో ఎండ్‌ అయింది. అంటే కేవలం 17 రోజుల్లోనే ట్విట్టర్‌ లాంటి మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్‌ డీల్‌ని క్లోజ్‌ చేశారు ఎలన్‌మస్క్‌.

ఎడిట్‌ బటన్‌తో ట్విట్టర్‌తో గేమ్ స్టార్ట్ చేశారు ఎలన్‌ మస్క్‌.. ఆ తర్వాత ఏప్రిల్ 9న ట్విట్టర్‌ పనైపోయిందని ట్వీట్ చేశారు. ట్విట్టర్‌ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో యాజమాన్యం పూర్తిగా విఫలమవుతోందని ఆరోపించారు మస్క్‌. ఎడిట్‌ బటన్‌తో పాటు పొడవైన ట్వీట్లను అనుమతించాలని సూచించారు. ఎలన్‌మస్క్‌ సూచనలతో ట్విట్టర్‌ యాజమాన్యం స్పందించింది. వచ్చి డైరెక్టర్‌గా జాయిన్ కావాలని ఆహ్వానించింది.

అయితే డైరెక్టర్‌గా కాదు.. స్టేక్ హోల్డర్‌గా అయితే సరేనంటూ కన్‌ఫాం చేశారు మస్క్‌. కారణం.. అమెరికా చట్టం ప్రకారం డైరెక్టర్‌గా ఉంటే 15శాతానికి మించి స్టేక్ కొనడానికి అవకాశం లేదు. అందుకే స్టేక్‌ హోల్డర్‌గా అయితే ఓకే అని రిప్లై ఇచ్చారు మస్క్‌. ఆ తర్వాత నేరుగా ట్విట్టర్‌ని కొనేందుకు 3 లక్షల కోట్ల రూపాయలకు డీల్ ఆఫర్ చేశారు మస్క్‌. ఆఫర్ పెద్దదే అయినా.. ట్విట్టర్‌ని ఇన్వెస్టర్ల ఆమోదం లేకుండా అమ్మేయడం సాధ్యమా అనే అనుమానం అందరిలో మొదలైంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్విట్టర్‌ను అమ్మాలంటే కనీసం ఆ డీల్‌పై ఏడాది పాటు చర్చ జరగాలి. కానీ ఎడిట్‌ బటన్‌ టాపిక్‌తో మొదలుపెట్టి కేవలం నెలరోజుల్లో వ్యవహారాన్ని డీల్‌ దాకా తీసుకొచ్చారు మస్క్‌. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో 15వ స్థానంలో ఉన్న ట్విట్టర్‌ను కొనాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న మొదట టెస్లా షేర్‌ హోల్డర్లలో మొదలైంది.

దీంతో రెండు వారాల క్రితం ఒక్కసారిగా టెస్లా షేర్లు 30 డాలర్లకు పడిపోయాయి. గతంలో డోజీ కాయిన్‌పైనా ఇలాగే ప్రేమ కురించి, చివరికి తన దగ్గర ఉన్న క్రిప్టోనే అమ్మేసుకున్నాడు మస్క్‌. అయితే ట్విట్టర్‌ విషయంలో మాత్రం ఎలన్‌మస్క్‌కు తిరుగులేకుండాపోయింది. అంతకుముందు ట్విట్టర్‌లో 9.2 శాతం వాటా కొనుగోలు చేసిన వెంటనే ట్విట్టర్‌ వాల్యూ 18 శాతం పెరిగింది.

దీంతో ఇక అప్పటి నుంచి ఒక్కో అడుగు వేస్తూ ఏకంగా ట్విట్టర్‌ సంస్థను పూర్తిగా కొనుగోలు చేసేందుకు పావులు కదిపారు మస్క్‌. ఏకంగా 3 లక్షల కోట్ల రూపాయల ఆఫర్‌ ప్రకటించాడు. దీంతో ఆఫర్‌ చేసిన మొత్తం భారీగా ఉండటంతో ట్విట్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచనలో పడింది. అసలు ఈ డీల్‌కి ఓకే చెప్పాలా ? లేక వెయిట్‌ చేయాలా ? అనే మీమాంసలో పడ్డారు ట్విట్టర్‌ నిర్వాహకులు. అయితే ఎట్టకేలకు ఎలన్‌మస్క్‌ ఆఫర్‌కు ఓకే చెప్పారు.

ఏప్రిల్‌ 14న తొలిసారి ట్విట్టర్‌కు ఆఫర్‌ ఇచ్చారు ఎలన్‌మస్క్‌. ఒక్కో షేర్‌కు 54.20 డాలర్ల చొప్పున 43 బిలియన్‌ డాలర్లు చెల్లిస్తానని తన మనసులో మాటను బయటపెట్టాడు. అప్పుడే ఆయన వివిధ బ్యాంక్‌ల నుంచి 46 బిలియన్‌ డాలర్ల రుణాన్ని సిద్ధం చేసుకున్నాడు. ట్విట్టర్‌ని ఎలన్‌మస్క్‌ టేక్‌ ఓవర్‌ చేయబోతున్నారనే వార్తలతో ఈ డీల్‌కి ముందే అంటే ఏప్రిల్‌ 22న ట్విట్టర్‌ షేర్లు 5 శాతం పెరిగాయి. ఎలన్‌మస్క్‌ మస్క్‌ ఆఫర్‌ ప్రకటించిన 11 రోజుల్లోనే ట్విట్టర్‌ ఈ డీల్‌కి ఓకే చెప్పింది.

ఏప్రిల్‌ 25న మస్క్‌ డీల్‌ని అంగీకరించింది ట్విట్టర్‌. 44 బిలియన్‌ డాలర్లకు డీల్‌ కుదిరింది. మస్క్‌ కొనుగోలు చేసిన మొత్తం విలువ ఏప్రిల్‌ 1న స్టాక్‌ మార్కెట్‌లో ట్విట్టర్‌ విలువ కంటే 38 శాతం ఎక్కువ. మరోవైపు ఒక్క నెలలోనే దాదాపు 3 లక్షల విలువైన డీల్‌ ని ఎలన్‌ మస్క్‌ క్లోజ్‌ చేసిన తీరు బిజినెస్‌ టైకూన్లనే ఔరా అనిపించేలా చేసింది. ఈ ఒక్క డీల్‌.. ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఎలా మారారో చెప్పకనే చెప్పింది.

ఇదిలావుంటే.. బిలియనీర్ ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో ప్రైవేట్‌గా తీసుకోబోయే డీల్ ముగిసిన తర్వాత సోషల్ మీడియా సంస్థ భవిష్యత్తు అనిశ్చితంగా ఉందని ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్ సోమవారం ఉద్యోగులకు సూచించారు. ఒప్పందం ముగిసే వరకు తాను CEO గా కొనసాగుతానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు పరాగ్ అగర్వాల్. రాయిటర్స్ అందించిన సమాచారం మేరకు.. టౌన్ హాల్ సమావేశంలో పరాగ్ మాట్లాడినట్లుగా సమాచారం. “ఒప్పందం ముగిసిన తర్వాత, ప్లాట్‌ఫారమ్ ఏ దిశలో వెళ్తుందో మాకు తెలియదు” అని అగర్వాల్ అనడం సంచలనంగా మారింది.

గతంలో ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న అగర్వాల్ నవంబర్‌లో సీఈవోగా నియమితులయ్యారు. Twitter ప్రాక్సీ ప్రకారం, 2021కి అతని మొత్తం పరిహారం $30.4 మిలియన్లు, ఎక్కువగా స్టాక్ అవార్డులలో ఉంది.

ఇవి కూడా చదవండి: Viral Video: తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు.. వీడియో చూస్తే వెంట్రుకలు నిక్కబొడుస్తాయి..!

LIC IPO: ఎల్ఐసీ ఐపీవో ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. రూ. 21 వేల కోట్లపై కన్నేసిన ప్రభుత్వం..