AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: ఎల్ఐసీ ఐపీవో ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. రూ. 21 వేల కోట్లపై కన్నేసిన ప్రభుత్వం..

దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ IPO మే 4న ప్రారంభమై మే 9న ముగుస్తుంది. ఈ మేరకు సోమవారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీఓ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వం తన 3.5 శాతం వాటాను విక్రయించనుంది.

LIC IPO: ఎల్ఐసీ ఐపీవో ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. రూ. 21 వేల కోట్లపై కన్నేసిన ప్రభుత్వం..
Lic Ipo
Venkata Chari
|

Updated on: Apr 26, 2022 | 6:30 AM

Share

దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవో(LIC IPO) మే 4న ప్రారంభమై మే 9న ముగుస్తుంది. ఈ మేరకు సోమవారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీఓ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వం తన 3.5 శాతం వాటాను విక్రయించనుంది. దీంతో ప్రభుత్వానికి రూ.21,000 కోట్లు రానున్నాయి. IPO ఆధారంగా, LIC విలువ రూ.6 లక్షల కోట్లుగా మారనుంది. ప్రభుత్వ బీమా కంపెనీ ఎల్‌ఐసీ(Life Insurance Corporation Of India)లో ప్రభుత్వ వాటాను విక్రయించేందుకు ఫైనాన్స్ బిల్లు, ఎల్‌ఐసీ చట్టంలో చేసిన మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు గత నెలలో కొట్టివేసింది.

ఎల్ పొన్నమ్మాళ్ దాఖలు చేసిన పిల్‌ను కొట్టివేస్తూ, మనీ బిల్లు ద్వారా ఎల్‌ఐసీ చట్టంలో చేసిన సవరణల్లో రాజ్యాంగ విరుద్ధం లేదని చీఫ్ జస్టిస్ ఎంఎన్ భండారీ, జస్టిస్ డి భరత్ చక్రవర్తిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభ పబ్లిక్ ఇష్యూని తీసుకురావడానికి మనీ బిల్లు ద్వారా ఎల్‌ఐసీ చట్టాన్ని సవరించడంలో రాజ్యాంగపరంగా తప్పు లేదని బెంచ్ పేర్కొంది.

మరోవైపు ఎల్‌ఐసీ పాలసీదారు పొన్నమ్మాళ్‌ తన పిటిషన్‌లో ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా విక్రయానికి సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు మనీ బిల్లును తప్పుగా ఆమోదించారని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 110 కింద మనీ బిల్లును తీసుకురావడం ద్వారా నిబంధనలలో మార్పులు చేశామని, అయితే మనీ బిల్లు నిర్వచనంలో ఇది రాదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి తీసుకొచ్చిన బిల్లును ద్రవ్య బిల్లుగా ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ స్పీకర్ ఇచ్చిన ఆమోదాన్ని సవాలు చేయలేమని ధర్మాసనం తన నిర్ణయంలో పేర్కొంది.

ఈ విషయంలో లోక్‌సభ స్పీకర్ నిర్ణయమే అంతిమమని ఆయన అన్నారు. ఎల్‌ఐసీలో కొంత వాటాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐపీఓ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ముందు ఐపీఓకు సంబంధించిన ముసాయిదాను కూడా సమర్పించింది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.60,000 కోట్లకు పైగా సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఎల్‌ఐసీ రూ.235 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏప్రిల్, డిసెంబర్ 2021 మధ్య, నికర లాభం రూ.1,671.57 కోట్లకు పెరిగింది.

సెబీకి దాఖలు చేసిన పత్రాల ఆధారంగా ఐపీఓ తీసుకురావడానికి మే 12 వరకు సమయం ఉందని ఓ అధికారి తెలిపారు. ధర పరిధితో త్వరలో RHPని ఫైల్ చేస్తామని, అలాగే మే 12లోగా ప్రభుత్వం ఐపీఓను తీసుకురాలేకపోతే, డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను పేర్కొంటూ సెబీకి కొత్త పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Post Office scheme: అదరిపోయే స్కీమ్.. రూ. 50 వేలు డిపాజిట్ చేసి రూ. 3,300 ఆదాయం పొందొచ్చు.. అదెలాగంటే..

Elon Musk: ట్విట్టర్ కొనుగోలు విషయంలో పంతం నెగ్గించుకుంటున్న ఎలాన్ మస్క్..! డీల్ వివరాలు..