Viral Video: తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు.. వీడియో చూస్తే వెంట్రుకలు నిక్కబొడుస్తాయి..!

Viral Video: కన్నడ సూపర్‌స్టార్‌ యష్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘కెజిఎఫ్‌’ ఏ రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. తల్లి సెంటిమెంట్‌ బేస్ చేసుకుని..

Viral Video: తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు.. వీడియో చూస్తే వెంట్రుకలు నిక్కబొడుస్తాయి..!
Hen
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 26, 2022 | 6:30 AM

Viral Video: కన్నడ సూపర్‌స్టార్‌ యష్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘కెజిఎఫ్‌’ ఏ రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. తల్లి సెంటిమెంట్‌ బేస్ చేసుకుని.. చిత్రీకరించిన ఈ సినిమాలో ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్ మాదిరిగా జనాల మదిలోకి దూసుకెళ్లిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈసినిమాలో ‘తల్లిని మించిన గొప్ప యోధులు ఎవరూ లేరు’ అంటూ రాఖీ భాయ్(యష్) చెప్పిన డైలా.. ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎందుకంటే.. తల్లి ప్రేమ అంతటిది కాబట్టి. తన పిల్లలకు ఆపద వస్తే తన ప్రాణాలను సైతం అడ్డు వేయగల ప్రేమ తల్లిది. తేడా వస్తే ప్రాణాలను సైతం తీయగల పంత తల్లిప్రేమ సొంతం. అది మనుషులు అయినా, జంతువులు అయినా, పక్షులు అయినా సరే.. తల్లి ప్రేమ అన్నింట్లోనే సమానమే అని చెప్పాలి. తాజాగా ఇందుకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో ఓ కోడి తన పిల్లలతో కలిసి మేత మేస్తోంది. ఇంతలో ఆకాశం నుంచి దూసుకొచ్చిన డేగ.. ఆ కోడి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఊహించని హఠాత్పరిణామంతో బెదిరిపోయింది తల్లికోడి. ఆ తరువాత క్షణాల్లో తేరుకున్న తల్లికోడి.. డేగపై రివర్స్ అటాక్ చేసింది. దాంతో తలపడి.. డేగనే హడలెత్తించింది. కోడి దెబ్బకు బిత్తరపోయిన డేగ బిక్కు బిక్కుమంటూ ఓ మూలన నక్కింది. కోడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు నకిలీ గాంభీర్యం ప్రదర్శించింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని తల్లికోడి.. డేగకు ఓ రేంజ్‌లో భయటపెట్టింది. ఆ తరువాత తిరిగి తన పిల్లల వద్దకు వెళ్లిపోయింది. ఈ అద్భుత దృశ్యానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. మరెందుకు ఆలస్యం ఈ సూపర్ వీడియోను మీరూ చూసేయండి.

Also read:

Deaflympics 2021: మే 1 నుంచి డెఫ్లింపిక్స్ 2021.. భారత అథ్లెట్ల బృందానికి ఘనంగా సెండాఫ్ ఇచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..

Big News Big Debate: హస్తంతో డీల్‌ – గులాబీతో ములాఖత్.. కేసీఆర్‌కు పీకే చెప్పిన ముచ్చటేంటి?..

KTPP fire accident: కేటీపీపీలో అగ్నిప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం..