Realme Narzo 50A Prime: రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..!

Realme Narzo 50A Prime: నేడు రియల్‌మి కంపెనీ కొత్తగా నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ని భారతదేశంలో ప్రారంభించింది. ఈ సరికొత్త ఫోన్ ఆక్టా-కోర్ యునిసోక్ T612 ప్రాసెసర్‌తో,

Realme Narzo 50A Prime: రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..!
Realme Narzo 50a Prime
Follow us

|

Updated on: Apr 25, 2022 | 4:18 PM

Realme Narzo 50A Prime: నేడు రియల్‌మి కంపెనీ కొత్తగా నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ని భారతదేశంలో ప్రారంభించింది. ఈ సరికొత్త ఫోన్ ఆక్టా-కోర్ యునిసోక్ T612 ప్రాసెసర్‌తో, 4GB RAM, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే ఈ హ్యాండ్‌సెట్ 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారతదేశంలో రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.11,499 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లాష్ బ్లాక్, ఫ్లాష్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది అమెజాన్ కంపెనీ ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ స్టోర్‌ల ద్వారా ఏప్రిల్ 28 నుంచి కొనుగోలుకి సిద్దంగా ఉన్నాయి.

Realme Narzo 50A ప్రైమ్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్11 ఆధారిత రియల్‌మి UI R ఎడిషన్‌తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లేని కలిగి ఉంది. ఇది 2,408×1,080 పిక్సెల్‌ల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 12nm ఆక్టా-కోర్ Unisoc T612 SoC ప్రాసెసర్, 4GB LPDDR4x RAMతో జత చేయబడి ARM Mali-G57 GPU ద్వారా శక్తిని పొందుతుంది.

రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు, వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చరు లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.8 ఎపర్చరుతో మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్ తో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.0 ఎపర్చరు లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ AI సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ కొత్త ఫోన్ 128GB వరకు ఇన్‌బిల్ట్ UFS 2.2 స్టోరేజీని అందిస్తుంది. దీనిని ప్రత్యేక మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించడానికి అవకాశం ఉంటుంది.

SBI vs HDFC vs ICICI vs Kotak vs BoB: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ ఏ బ్యాంకు చెల్లిస్తుందో తెలుసుకోండి..!

Viral Video: మీ చిన్నతనంలో ఇలాంటి తుంటరి గేమ్‌ ఎప్పుడైనా ఆడారా.. పగలబడి నవ్వుతారు..!

IPL 2022: సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ కొట్టేశాడు.. కానీ 24 లక్షల ఫైన్‌ కూడా కట్టాడు..!

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి