IPL 2022: సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ కొట్టేశాడు.. కానీ 24 లక్షల ఫైన్‌ కూడా కట్టాడు..!

IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మరో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ 36 పరుగుల తేడాతో గెలిచింది.

IPL 2022: సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ కొట్టేశాడు.. కానీ 24 లక్షల ఫైన్‌ కూడా కట్టాడు..!
Kl Rahul
Follow us
uppula Raju

|

Updated on: Apr 25, 2022 | 2:43 PM

IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మరో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ 36 పరుగుల తేడాతో గెలిచింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుస ఓటమి. ముంబైని ఓడించడంలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది . రాహుల్ అజేయంగా 103 పరుగులు చేసి లక్నోకు 168 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అందుకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. జట్టును విజయతీరాలకు చేర్చడంలో రాహుల్ సఫలమైనా ఆ తర్వాత జేబు మాత్రం ఖాళీ అయింది. స్లో ఓవర్ రేట్ కారణంగా లక్నో జట్టుకు ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జరిమానా విధించింది. ఇలా జరగడం ఇది రెండోసారి. గతంలో కూడా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడింది. మ్యాచ్ అనంతరం రాహుల్ తన బాధను వ్యక్తం చేశాడు. రాహుల్ సాలరీ నుంచి 24 లక్షల రూపాయలను కట్ చేశారు.

రాహుల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైనప్పుడు ఈ విధంగా మాట్లాడాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా విధించిన పెనాల్టీకి అవార్డుతో పరిహారం చెల్లించాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ సీజన్‌లో డిఫెన్స్‌లో మెరుగ్గా, పవర్‌ప్లేలో మెరుగ్గా రాణించి, చివరి ఓవర్లలో మెరుగ్గా రాణించగల జట్టు ఈ టోర్నీని గెలవగలదని రాహుల్ జోస్యం చెప్పాడు. ఈ సందర్భంగా మాకు మంచి ఆల్‌రౌండర్లు ఉండటం అదృష్టమని పేర్కొన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Detox Drinks: ఈ 5 డిటాక్స్‌ డ్రింక్స్‌తో సులువుగా బరువు తగ్గండి..!

Military Expenditure: తగ్గేదేలే.. ఆ విషయంలో అమెరికా, చైనా తర్వాత ఇండియానే..!

IPL 2022: కృనాల్‌ పాండ్య ముద్దులు.. కోపంతో తిరస్కరించిన పొలార్డ్‌..!