AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: కృనాల్‌ పాండ్య ముద్దులు.. కోపంతో తిరస్కరించిన పొలార్డ్‌..!

IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది.

IPL 2022: కృనాల్‌ పాండ్య ముద్దులు.. కోపంతో తిరస్కరించిన పొలార్డ్‌..!
Krunal Pandya
uppula Raju
|

Updated on: Apr 25, 2022 | 12:43 PM

Share

IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. దీంతో వరుసగా 8 మ్యాచ్‌లు కోల్పోయింది.169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 20 ఓవర్లలో 132 పరుగులకే పరిమితమైంది. వాస్తవానికి వరుస ఓటములతో ఉన్న ముంబై ఇండియన్స్.. లక్నోపై విజయం సాధించాలనే కసితో ఉంది. అయితే రోహిత్ ఆలోచన రివర్స్ అయింది. తక్కువ లక్ష్యం ఉన్నప్పటికీ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. అయితే ఈసారి లక్నో సూపర్ జెయింట్స్‌ తరపున ఆడుతున్న కృనాల్‌ పాండ్య గతంలో ముంబై ఇండియన్స్‌ టీంలో సభ్యుడు. అతడు చేసిన పనికి ముంబై ఇండియన్స్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌కి చిర్రెత్తుకొచ్చింది. ఇంతకీ ఏం చేశాడో తెలుసుకుందాం.

ముంబై ఇండియన్స్, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌ చేశాడు. క్రీజులో కీరన్ పొలార్డ్ ఉన్నాడు. పొలార్డ్ తొలి బంతికే దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ వైపు వెళుతున్నాడు. ఈ సందర్భంలో కృనాల్ పాండ్యా పొలార్డ్‌పై దూకి అతని తలను ముద్దాడాడు. దీంతో పొలార్డ్‌కి విపరీతమైన కోపం వచ్చింది. కృనాల్ పాండ్యా చేసిన పని అతడికి ఏమాత్రం నచ్చలేదు. అతడి ముఖంలో అది స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది.

Health Tips: మీ కుటుంబంలో షుగర్‌ పేషెంట్లు ఉన్నారా.. అయితే మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

Viral Video: ఇదేం డ్రైవింగ్‌రా బాబు.. కొంచెముంటే ప్రాణాలు పోయేవి..!

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి