AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ కుటుంబంలో షుగర్‌ పేషెంట్లు ఉన్నారా.. అయితే మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

Health Tips: ఆధునిక కాలంలో చాలా వ్యాధులు చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్నాయి. వారసత్వంగా వచ్చే వ్యాధులు చాలా తక్కువ. అయితే ఒక్క మధుమేహం

Health Tips: మీ కుటుంబంలో షుగర్‌ పేషెంట్లు ఉన్నారా.. అయితే మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
Diabetes
uppula Raju
|

Updated on: Apr 25, 2022 | 12:04 PM

Share

Health Tips: ఆధునిక కాలంలో చాలా వ్యాధులు చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్నాయి. వారసత్వంగా వచ్చే వ్యాధులు చాలా తక్కువ. అయితే ఒక్క మధుమేహం మాత్రం వారసత్వంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం కాలక్రమేణా గుండె జబ్బులు, ఊబకాయం వంటి కొన్ని తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే మంచి జీవనశైలిని అలవర్చుకోవడం తెలివైన పని. దీని గురించి కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం.

1. బాగా నిద్రపోండి: మీకు తగినంత నిద్ర లేకపోతే అది ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుంది. ఇది బరువు పెరగడం, ఆందోళన, డిప్రెషన్‌కు దారి తీస్తుంది. కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా మధుమేహంతో బాధపడుతున్నట్లయితే ముందుగా నిద్ర గురించి తెలుసుకోవాలి. పెద్దలు రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోతారు. ఒక అధ్యయనం ప్రకారం నిద్ర సమయాన్ని పొడిగించడం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. పురుషులలో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. సరైన సమయంలో తినండి: కుటుంబంలో ఎవరికైన మధుమేహం ఉన్నట్లయితే మీరు కూడా సరైన సమయంలో ఆహారం తినడం అలవాటు చేసుకోండి. అధిక ప్రోటీన్ ఆహారం తీసుకుంటే మంచిది. చక్కెర, కార్బోహైడ్రేట్ల తీసుకోవడం పరిమితం చేయాలి.

3. బరువు అదుపులో: టైప్-2 మధుమేహం ఉన్న రోగులు ప్రారంభంలో బరువు తగ్గుతారు. కానీ దీర్ఘకాలంలో మళ్లీ పెరిగే అవకాశాలు ఉంటాయి. పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు నిల్వ ఉండడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

4. చురుగ్గా ఉండండి: ఒకే దగ్గర కూర్చోవడం లేదా చదువుకోవడం లేదా సినిమాలు చూడటం లేదా వర్క్‌ ఫ్రం హోం చేయడం వల్ల డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మీ పని మధ్యలో విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. శరీరం చురుగ్గా ఉండేందుకు కొద్దిసేపు నడవడం మంచిది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: ఇదేం డ్రైవింగ్‌రా బాబు.. కొంచెముంటే ప్రాణాలు పోయేవి..!

Migraine: ఈ కారణాల వల్ల మైగ్రేన్‌ వేధిస్తుంది.. అవేంటో తెలుసుకోండి..

Heat Stroke: హీట్‌స్ట్రోక్‌ నివారించడానికి ఆయుర్వేద మార్గాలు ఇవే..!